09-08-2025 | శనివారంI రాశి ఫలితాలు

మేషం ♈
- చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.
- వృథా ఖర్చులు పెరుగుతాయి.
- కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.
- వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
- ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.
- నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
వృషభం ♉
- వివాదాలకు సంబంధించిన విలువైన విషయాలు సేకరిస్తారు.
- రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి.
- గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
- బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
- వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
- ఉద్యోగాలలో కొంత పురోగతి ఉంటుంది.
మిథునం ♊
- ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.
- పనుల్లో శ్రమ తప్పదు.
- అనవసర వస్తువులపై ఖర్చు చేస్తారు.
- కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
- వ్యాపార ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి.
- అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
- ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కర్కాటకం ♋
- ప్రణాళికలు క్రమపద్ధతిలో పూర్తి చేస్తారు.
- ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
- సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
- విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది.
- నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది.
సింహం ♌
- కొత్త కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతం చేస్తారు.
- గృహ, వాహన యోగం కలుగుతుంది.
- వ్యాపార నిర్ణయాలు లాభం తెస్తాయి.
- విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి.
- సంఘంలో గౌరవం పెరుగుతుంది.
- వ్యాపారం, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కన్య ♍
- కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
- ముఖ్యమైన పనులు మందగిస్తాయి.
- ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉంటాయి.
- డబ్బు నిల్వ ఉండదు.
- కొత్త వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
- ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.
తుల ♎
- బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.
- ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
- కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేస్తారు.
- వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
- ఉద్యోగులకు స్థాన చలనం సూచనలు ఉన్నాయి.
- నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం ♏
- ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
- ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది.
- సమాజంలో విలువ పెరుగుతుంది.
- ఆలయ దర్శనాలు చేస్తారు.
- ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
- వ్యాపారాలు విస్తరిస్తాయి.
- ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
ధనస్సు ♐
- నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి.
- చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
- పాత బాకీలు వసూలవుతాయి.
- ఇతరులకు సహాయం చేస్తారు.
- వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
- ఉద్యోగ వివాదాలు పరిష్కారం అవుతాయి.
- నూతన వాహన యోగం ఉంటుంది.
మకరం ♑
- పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
- బంధువులతో వివాదాలు సర్దుతాయి.
- శ్రమకు తగిన ఫలితం దక్కదు.
- దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
- ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
- వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
- ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.
కుంభం ♒
- మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.
- ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.
- స్థిరాస్తి వివాదాలలో జాగ్రత్త అవసరం.
- కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు.
- వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
- ఉద్యోగాలలో ఇతరుల ఇబ్బందులు తప్పవు.
మీనం ♓
- చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
- ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
- వాహన కొనుగోలు యత్నాలు వేగవంతం అవుతాయి.
- వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
- అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు.
🍁 శుభం భూయాత్ 🍀
