08-09-2025 / సోమవారం / రాశి ఫలితాలు 🌟

♈ మేషం
- చేపట్టిన పనులు కష్టపడి పూర్తవుతాయి.
- స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దల సలహా అవసరం.
- వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.
- ఉద్యోగాలలో అధికారుల వ్యతిరేకత పెరుగుతుంది.
- ప్రయాణాలు వాయిదా పడతాయి.
- సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
♉ వృషభం
- సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి.
- అవసరమైన ధనం లభిస్తుంది.
- స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
- గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
- వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
- దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
♊ మిధునం
- నేత్ర సంబంధిత సమస్యలు ఇబ్బందిపెడతాయి.
- పనులు మందకొడిగా సాగుతాయి.
- ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.
- నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేరు.
- వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి.
♋ కర్కాటకం
- సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.
- అనుకున్న పనులు జాప్యం అయినా పూర్తవుతాయి.
- ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
- ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
- వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు లభిస్తాయి.
- ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
♌ సింహం
- పనులు మందకొడిగా సాగుతాయి.
- వ్యాపారాలలో కొత్త సమస్యలు వస్తాయి.
- ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.
- ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.
- ఉదర సంబంధ సమస్యలు కలుగుతాయి.
- వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
♍ కన్య
- ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
- గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది.
- ప్రముఖుల ఆదరణ లభిస్తుంది.
- సంతాన ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
- బంధు మిత్రుల సహాయంతో పనులు పూర్తవుతాయి.
- ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం.
♎ తుల
- శ్రమకు తగిన ఫలితం రాదు.
- వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగండి.
- ఉద్యోగ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
- వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
- ఇంటి బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
- బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
♏ వృశ్చికం
- కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు జరుగుతాయి.
- చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి.
- ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి.
- వ్యాపారాలు మందగిస్తాయి.
- ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
- కుటుంబ ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
♐ ధనస్సు
- దూరప్రయాణాలను వాయిదా వెయ్యడం మంచిది.
- సంతాన సంబంధ సమస్యలు కలుగుతాయి.
- వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
- విద్యార్థులు మరింత కష్టపడాలి.
- ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగుకలిగిస్తాయి.
- విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
♑ మకరం
- జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
- ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
- సంతాన విద్యా విషయాలు సానుకూలంగా ఉంటాయి.
- ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
- ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి.
♒ కుంభం
- ఆర్థిక ఆలోచనలు అనుకూలిస్తాయి.
- ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలు వస్తాయి.
- బంధు మిత్రులతో సఖ్యత ఉంటుంది.
- వ్యాపారాలలో శత్రు సమస్యల నుండి బయటపడతారు.
- ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
- కుటుంబంతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
♓ మీనం
- మంచి ఆలోచన, జ్ఞానంతో ముందుకు సాగుతారు.
- కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.
- దూర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
- ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు.
- వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.
- సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వస్తాయి.
