09-09-2025 మంగళవారం రాశి ఫలితాలు

♈ మేషం
ఆరోగ్యంపై అశ్రద్ధ వివాదాలకు దారితీస్తుంది.
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
నూతన వాహన కొనుగోలు వాయిదా పడుతుంది.
నిరుద్యోగులకు అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
♉ వృషభం
ఇంట్లో, బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.
నూతన వస్తువులు, వస్త్రలాభాలు పొందుతారు.
సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి.
ఆదాయం అన్నివైపుల నుండి వస్తుంది.
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
నూతన వాహన యోగం ఉంది.
♊ మిధునం
మానసిక సమస్యలు కలవరపెడతాయి.
కుటుంబ విషయాలలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి.
వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వివాదాలకు దూరంగా ఉండండి.
వృథా ఖర్చులు పెరుగుతాయి.
చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
♋ కర్కాటకం
ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు.
కుటుంబంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.
ఉద్యోగుల కష్టానికి ఫలితం లభిస్తుంది.
♌ సింహం
చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురవుతాయి.
వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ గుర్తింపు రాదు.
ఆర్థిక వ్యవహారాలలో స్వీయ ఆలోచనలు ఫలవు ఇవ్వవు.
భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
గృహంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.
♍ కన్యా
ఋణ సమస్యల నుండి బయటపడతారు.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కుటుంబ సహకారంతో పనులు పూర్తిచేస్తారు.
వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
వ్యాపారాలలో అంచనాలను మించి లాభాలు పొందుతారు.
♎ తుల
బంధు, మిత్రులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు.
అవరోధాలున్నా పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఋణాలను తీర్చగలుగుతారు.
ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
♏ వృశ్చికం
ఇంటా, బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
భవిష్యత్తు విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబంతో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు వస్తాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
♐ ధనుస్సు
శారీరక, మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది.
అనుకున్న పనులు సమయానికి పూర్తికావు.
బంధు, మిత్రులతో చిన్న విభేదాలు వస్తాయి.
ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
♑ మకరం
నూతన వస్తువులు, వాహన సౌకర్యాలు పొందుతారు.
ధనపరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి.
బంధు, మిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది.
ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
దూరప్రయాణ సూచనలు ఉన్నాయి.
నిరుద్యోగ సమస్యలు తగ్గుతాయి.
♒ కుంభం
ఇంట్లో, బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
చేపట్టిన పనులు జాప్యం తరువాత పూర్తవుతాయి.
కీలక విషయాలలో సోదరుల సలహా తీసుకోవడం మంచిది.
సంతాన ఆరోగ్య విషయమై శుభవార్తలు వస్తాయి.
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
♓ మీనం
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
ధన విషయాలలో తొందరపడి మాట ఇవ్వకండి.
వృత్తి, వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది.
ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
