Uncategorized

19-09-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు 🌟

blank

♈ మేషం

అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.


♉ వృషభం

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు కలుగుతాయి.


♊ మిధునం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనయోగం ఉంది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.


♋ కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్ప లాభాలు ఇస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది.


♌ సింహం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.


♍ కన్య

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు.


♎ తుల

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడినా ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన సమస్యలు తలెత్తుతాయి.


♏ వృశ్చికం

గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.


♐ ధనస్సు

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి.


♑ మకరం

అనుకున్న పనులు అనుకున్న రీతిలో సఫలమవుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.


♒ కుంభం

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. సంతానం విద్యలో సంతృప్తికర ఫలితాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.


♓ మీనం

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు వస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.


🍁 శుభం భూయాత్ – సర్వేజనాః సుఖినో భవంతుః 🍀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
Uncategorized

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన నివాసాలుగా గౌరవించబడతాయి, ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు
Uncategorized

అపోహలను తొలగించడం: తంత్రం మరియు బ్లాక్ మ్యాజిక్ మధ్య వ్యత్యాసం

తంత్రం మరియు చేతబడి తరచుగా గందరగోళం చెందుతాయి, కానీ వాస్తవానికి, అవి ప్రపంచాలు వేరు. రెండు పదాలు ఆధ్యాత్మికత మరియు ఆచారాల చిత్రాలను సూచించవచ్చు, అయితే తంత్రం