20-09-2025 • శనివారం • రాశి ఫలితాలు

మేషం ♈
- చిన్ననాటి మిత్రులతో కారణ కలహాలు సూచనలున్నవి.
- అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
- సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.
- దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
- దూరప్రయాణ సూచనలున్నవి.
- వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
వృషభం ♉
- చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
- ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
- రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
- వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
- ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు వస్తాయి.
- ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మిధునం ♊
- సమాజంలో పరిచయాలు పెరుగుతాయి.
- మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
- కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
- ఆర్థిక వృద్ధి కలుగుతుంది.
- కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలవుతాయి.
- వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం ♋
- చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
- విలువైన వస్తు లాభాలు పొందుతారు.
- చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.
- ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా ఉంటాయి.
- నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
- వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం ♌
- ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
- వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం రాదు.
- సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి.
- మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
- ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
- ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకును కలిగిస్తాయి.
కన్య ♍
- చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
- వృధా ఖర్చులు పెరుగుతాయి.
- ఇంటా బయట పని ఒత్తిడి వలన విశ్రాంతి తక్కువగా ఉంటుంది.
- కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
- దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
- వ్యాపార విషయంలో అప్రమత్తత అవసరం.
తుల ♎
- బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు.
- సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
- ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
- నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
- స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
- వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు అవుతాయి.
- ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం ♏
- కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.
- ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
- ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
- స్వల్ప అనారోగ్యం సమస్యలు ఉంటాయి.
- వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.
- ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
ధనుస్సు ♐
- నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
- కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది.
- బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
- కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
- అవసరానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
మకరం ♑
- ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.
- వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది.
- ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు వస్తాయి.
- దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
- వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
- ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.
కుంభం ♒
- దూరపు బంధువుల నుండి శుభవార్తలు వస్తాయి.
- ఆర్థికంగా అనుకూలత లభిస్తుంది.
- కొత్త వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.
- చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
- వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
- ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.
మీనం ♓
- చిన్ననాటి మిత్రులతో ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు.
- ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారులు గుర్తింపు ఇస్తారు.
- చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.
- వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.
- ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
- వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.
