24-09-2025 బుధవారం రాశి ఫలితాలు

♈ మేషం
- దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.
- చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
- ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
- వృత్తి, ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి.
- ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
♉ వృషభం
- ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
- కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
- సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం.
- వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
- వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
- దైవ చింతన పెరుగుతుంది.
♊ మిథునం
- శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
- మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
- ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
- చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు.
- వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి.
- ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
♋ కర్కాటకం
- నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది.
- కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చుతాయి.
- నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.
- వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
- సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
♌ సింహం
- ప్రారంభించిన పనులు నిలిచిపోతాయి, జాప్యం కలుగుతుంది.
- ధనపరంగా ఇబ్బందులు తప్పవు.
- ఇంటి, బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.
- కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
- వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసి రావు.
- దైవ చింతన కలుగుతుంది.
♍ కన్యా
- ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.
- ఇంటి, బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.
- వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు.
- ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
- స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
♎ తుల
- కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
- దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.
- అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.
- నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
- వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
- వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.
♏ వృశ్చికం
- ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.
- ఇతరుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
- దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
- సంతానానికి కొత్త విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
- శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
♐ ధనుస్సు
- చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.
- ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
- కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు.
- నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
- ఇంటి, బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
♑ మకరం
- సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
- గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు.
- వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
- సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
- సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.
♒ కుంభం
- అనుకున్న సమయానికి సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.
- దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.
- ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
- వృత్తి, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.
- కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.
♓ మీనం
- కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
- నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
- ఇంటి, బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
- చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
- గృహానికి బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
- వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
