రథసప్తమి 2026 విశిష్టత: సూర్యారాధన మహత్యం, శుభ సమయాలు & పూజా విధానం

రథసప్తమి 2026 విశిష్టత: సూర్యారాధన మహత్యం, శుభ సమయాలు & పూజా విధానం
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
రథసప్తమి విశిష్టత 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
రథ సప్తమి – సూర్యారాధన సమయం
హిందూ పంచాగం ప్రకారం ఈ సంవత్సరం మాఘ శుక్ల సప్తమి తిథి 2026 జనవరి 25వ తేదీన తెల్లవారుజామున 12:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు జనవరి 25వ తేదీన రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం రథ సప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు. ఇర ఈ రథసప్తమి రోజు ఉదయించే సూర్యుడికి ప్రార్థనలు, పూజలు చేస్తారు. కాబట్టి ఈ ఏడాది రథ సప్తమి రోజు సూర్యోదయం ఉదయం 7:13 గంటలకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలు, ఆచరించే పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక రథసప్తమి 2026 రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం 5:26 గంటల నుంచి 7:13 వరకు శుభ సమయం ఉంటుంది.
*రథసప్తమి విశిష్టత:-
మానవుడు తరించడానికి సూర్యారాధన మినహా మరో మార్గం లేదు. భారతీయ వాంగ్మయం యొక్క సనాతన పరంపరలో సూర్య భగవానుని స్థానము, మహిమ కూడా అద్వితీయం. సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి, మనము అనేక దేవత మూర్తులను సేవిస్తున్నాం. కానీ మనకు ఆ మూర్తులన్నీ వేద, ఉపనిషత్తు, పురాణాదులలో వివరించబడినటువంటి విషయాల ఆధారంగా కనిపిస్తున్నారు. సూర్యుడు ప్రతిరోజూ ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్న దైవం. సమస్త విశ్వానికి ఆయనే ఆత్మ.
ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం…
భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు.
సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు.
ఏడు గుర్రాలు ఎందుకంటే….. “”సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు.
మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్యజయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు.. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది.
రోగ, ఋణ శత్రు బాధలు తొలగిపోవడానికి సూర్యోపాసన:~
“సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే ఋణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే ‘యోపం పుష్పం వేదా, పుష్పవాన్ ప్రజావాన్, పశుమాన్ భవతి’ అనే వాక్యాలు దీనికి సంబంధించినవే.
సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు.
సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ ‘డి’ లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు, ఆర్ఘ్యప్రధానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.
ఓం శ్రీ ఆదిత్యాయ నమః॥
ఓం నమో నారాయణాయ!!
ఓం నమః శివాయ;;
*_🌻శుభమస్తు🌻 ❀┉┅━❀🕉️❀┉┅━❀ 🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏 🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 👉 రథ సప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఏమి చేయాలి? ఏం చదవాలి? ❗ సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి దండకం కానీ, స్తోత్ర పాఠాదులు కానీ, ఈరోజు మనం పారాయణ చేయాలి. అలాగే నమస్కారం చేస్తే ఆయన సంతోషిస్తాడు గనుక సూర్య నమస్కారాలు కూడా ఆచరించాలి. వేదం తెలిసినవారు కానీ, ఎవరైనా బ్రాహ్మణులు లభిస్తే అటువంటి వారిని ఇంటికి పిలిపించి వారిచేత సూర్య నమస్కారాలను ఆచరింపజేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. ❗ "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" "నమస్కార ప్రియ భానుః" సూర్య నారాయణ మూర్తికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ❗ శ్రీమద్రామాయణంలో 107వ సర్గలో యుద్ధకాండలో వస్తుంది. రామచంద్రమూర్తి రావణాసురుని యుద్ధరంగంలో ఎదుర్కొనడానికి పూర్వం అగస్త్యుల వారు రాముల వారికి ఈ స్తోత్రాన్ని బోధిస్తారు. ఈ స్తోత్రాన్ని ఈరోజు 12 మార్లు స్తోత్రం చేస్తే విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. ఇదివరకు చేయనివారు ఈరోజు ప్రారంభం చేయాలి. అది రథసప్తమి మనకు అందించే సందేశం. 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻