శివరాత్రి ప్రత్యేకం: గుజరాత్లో 111 అడుగుల బంగారు శివయ్య

🕉️ శివరాత్రి రోజున… బంగారు శివయ్య ✍️
🌟 ప్రపంచంలోనే తొలి బంగారు శివుని విగ్రహం
ప్రపంచంలోనే తొలి బంగారు శివుని విగ్రహం శివరాత్రి రోజున గుజరాత్ లో ప్రారంభించారు.
ఆకాశమంత ఎత్తులో దర్శనమిస్తున్న ఈ పరమశివుడి మహా ప్రతిమను చూశారా!
ఇదేదో సాధారణ విగ్రహం అనుకుంటే మీరు పొరపడినట్టే. ఎందుకంటే, ఇది నిలువెత్తు స్వర్ణ విగ్రహం.
🛕 111 అడుగుల స్వర్ణ మహామూర్తి
శివుడు పరమయోగి. భక్తులకు కొంగుబంగారమేమో గానీ తాను మాత్రం శరీరమంతా భస్మం పూసుకుని స్మశానాల్లో తిరుగుతాడు.
అయినా భక్తులు వింటారా? అందుకే, శివయ్య విగ్రహాన్ని 111 అడుగుల ఎత్తుతో పూర్తి బంగారుమయంగా తీర్చిదిద్దారు.
ఏళ్ల నాటి స్వర్ణ సంకల్పాన్ని ఈ శివరాత్రి నాటికి పూర్తి చేశారు. వడోదర లోని సుర్సాగర్ సరస్సు మధ్యలో కొలువైందీ భారీ శివమూర్తి.
🏗️ నిర్మాణ నేపథ్యం
మంజల్పూర్ ఎమ్మెల్యే యోగేశ్ పటేల్ ఆధ్వర్యంలోని సత్యం శివం సుందరం సమితి ట్రస్ట్ తీసుకున్న శివసంకల్పమిది.
ఏళ్లనాటి ఆ సంకల్పం కరెక్టుగా ఈ శివరాత్రి నాటికి పూర్తయ్యింది.
- 1996లో విగ్రహ నిర్మాణం ప్రారంభం
- 2002లో నిర్మాణం పూర్తి
- మొదట రాగితో నిర్మాణం
- 2012లో జాతికి అంకితం
ఇన్నేళ్ల తర్వాత ఈ విగ్రహానికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్ సంకల్పించింది.
💰 17.5 కేజీల బంగారం – 12 కోట్ల వ్యయం
ఈ భారీ విగ్రహానికి బంగారుపూత అంటే మామూలు విషయం కాదు.
- మొత్తం 17.5 కేజీల బంగారం
- సుమారు 12 కోట్ల రూపాయల వ్యయం
మొదట్లో అది సాధ్యం కాదని అనుకున్నా భక్తుల సహకారంతో కార్యరూపం దాల్చింది.
విరాళాలు ఇచ్చేందుకు ప్రజలు, ఎన్నారైలు ముందుకు రావడంతో మహత్కార్యం ముందుకు సాగింది. దీంతో అనుకున్న సమయానికి స్వర్ణ సంకల్పం నెరవేరింది.
🙏 భక్తుల ఆనందం
ఈ మహాశివుడి మహా మూర్తిని చూసి భక్తజనులు ఉప్పొంగిపోతున్నారు.
సరస్సు నడిమధ్యన వెలిసిన ఈ బంగారు శివస్వరూపం సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.
“హర్ హర్ మహాదేవ్ శంభోశంకర” అంటూ భక్తులు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే శివరాత్రి సందర్భంగా స్వర్ణమూర్తిని దర్శించుకున్నారు. ✍️
🌷🙏🌷 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷
🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! 🙏
