సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు

చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు
కానీ,
బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.
నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు.
ధైర్యం కోల్పోవడమే!!!!!
ఎలాంటి పరిస్థితుల్లోకూడా ధైర్యంకోల్పోవద్దు..
ఎప్పుడు బేలాగా ఏడవద్దు.
పిరికితనము మనిషిని ప్రతి క్షణము చంపుతుంది.
అన్ని కోల్పోయినా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు.
అదొక్కటి ఉంటే చాలు.
మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.
మనల్ని బలవంతులుగా మార్చే
ప్రతీ అంశాన్ని తీసుకుందాం..
బలహీనులుగా మార్చే ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం…..!
ఎదురుగా ఉన్నప్పుడు
పిలిచే హృదయము కన్నా..
దూరంగా ఉన్నప్పుడు
తలిచే హృదయము గొప్పది..!
తేనెలో ముంచిన వేప
తన తత్వాన్ని కోల్పోలేదు
పాముకు ఎన్ని పాలు పోసినా
విషం మాత్రం తగ్గిపోదు
అలాగే మనుసులో
చెడు ఆలోచనలు నింపుకొని
అనునిత్యం గంగ స్నానం చేసినా.
వారిలోని
మలినాలు తొలిగిపోవు
చెడుగుణం మారిపోదు.
ఆనందం, నమ్మకం
అమ్మకానికి దొరకవు.
ఆనందం
మనుషులతో పంచుకోవాలి,
నమ్మకం
మనసులో పెంచుకోవాలి.
