ఆధ్యాత్మికత

ఒకటిన్నర నిముషం“క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే”

ఒకటిన్నర నిముషం“క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే”

ఒకటిన్నర నిముషం

“క్రియాసిద్ధి ర్భవతి సత్త్వే మహతాం నోపకరణే”

అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. దానర్థం “గొప్పవాళ్లు వాళ్ల శక్తితో పనులు సాధిస్తారు గాని బాహ్యోపకరణాల (tools) సహాయంతో కాదు” అని.

ఉదాహరణగా రాముణ్ణి చెబుతారు. ఆయనకి ఏ పంచమాంగదళం ఉండి సీత జాడ తెలుసుకోగలిగాడు? ఎన్ని అక్షౌహిణుల సైన్యం ఉండి ఖరదూషణాదులని కొద్ది నిముషాల్లో కడతేర్చ గలిగాడు? అని చెబుతారు.

కొన్నాళ్ల క్రితం కెనడాలో ఒక అణు రియాక్టర్ పేలింది.

దాన్ని విచ్ఛిన్నం చేసి రేడియేషన్ వ్యాప్తి చెందకుండా కాపాడడానికి కావలసిన సాంకేతిక సహాయం కోసం కెనడా అమెరికాని అర్థించింది. అమెరికా ఒక బృందాన్ని పంపింది.

జిమ్ కార్టర్ ఆ బృందానికి నాయకుడు. అప్పుడతనికి 28 ఏళ్లు.

జిమ్ కార్టర్ పరిస్థితిని సమీక్షించాడు. దాన్ని రిమోట్‌గా విడగొట్ట గల అవకాశం లేదని గ్రహించాడు. ఎవరైనా లోపలికి ప్రవేశించి దాన్ని మాన్యుయల్‌గా విచ్ఛిన్నం చేయడం తప్ప మార్గాంతరం లేదు. కాని లోపలికి వెళ్లిన వ్యక్తి 90 సెకండ్లకి మించి లోపల ఉంటే ప్రాణాంతకమైన రేడియేషన్‌కి గురవుతాడు.

జిమ్మీ కార్టర్ లోని మానవత్వం అతని లోని ఇంజినీర్ని నిద్ర లేపింది. ఎదురుగా ఉన్న టెన్నిస్‌కోర్ట్‌లో ఆ ప్లాంట్‌కి ప్రతిరూపం నిర్మించాడు. లోపలి సెటప్ అంతా అనురూపితం అంటే సిములేట్ (simulate) చేశాడు. అతనూ అతని బృందం లోపలికెళ్ళివెయ్యాల్సిన ప్రతి చిన్నఅడుగూ సూక్ష్మవివరాలతో సహా ప్రాక్టీస్ చేశారు. ప్లాన్ చేశారు. జీర్ణించుకుని ఒంట బట్టించు కున్నారు. ఒక్కొక్కరే లోపలి కెళ్లి, అక్కడ 90 సెకండ్లు దాటకుండా ఉండి విజయవంతంగా పని పూర్తి చేసుకుని బైటికి వచ్చారు.

అటు తరువాత కొన్నాళ్లకి 1977 లో జిమ్మీ కార్టర్ అమెరికా ప్రెసిడెంట య్యాడు. ‘81 దాకా పదవిలో ఉన్నాడు. తరువాత మానవహక్కుల పరిరక్షణకై చేసిన కృషికై నోబెల్ శాంతి బహుమతి పొందాడు.

అతని సంకల్ప బలాన్ని కాలం గుర్తించిందేమో, రేడియేషన్ అతన్ని ఏమీ చేయలేదు. ఒక ఆర్నెల్ల దాకా అతని యూరిన్‌లో రేడి యేషన్ ఉండేది. అయినా అతను సంపూర్ణాయుర్దాయంతో నూరేళ్లు జీవించి, 2024 లో కన్నుమూశాడు.

( ఆధారం: గూగుల్‌లో ఒక వ్యాసం)

23.3.26.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected