దేవుడనే వాడు ఉన్నాడా?

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది. ఏదైనా గొప్ప ఆర్టికల్ ప్రచురించి మంచిపేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక. అక్కడే ఉన్న ఒక వృద్ధ పూజారిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ : మీ వయసు ఎంతుంటుందండి?
పూజారి : 85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ : ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
పూజారి : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి… ఎందుకమ్మా అలాడుగుతున్నావు.!?
జర్నలిస్ట్ : ఏమిలేదు స్వామీ… మీరు ఇన్ని సంవత్సరాల నుండి దేవుణ్ని పూజిస్తూ, ప్రార్దిస్తున్నారు కదా.!. మరి మీరు ఎప్పుడైనా దేవున్ని చూసారా.!?
పూజారి : లేదండి.!!
జర్నలిస్ట్ : మరి అలాంటప్పుడు ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళ్ళుతున్నారు.!!?
పూజారి : మీరెక్కడ నుండి వచ్చారు?*
జర్నలిస్ట్ : సిటీ నుండి.,
పూజారి : అక్కడ ఎక్కువ మంది రకరకాల కుక్కల్ని పెంచుకొంటారట కదా.!?
జర్నలిస్ట్ : అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు.
పూజారి : మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంటచేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు.
జర్నలిస్ట్ : నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం.!?
పూజారి : నీ ప్రశ్నకు సమాధానం వుందమ్మ చెపుతా… విను, రాతిళ్ళు పంటచేల్ల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టు ప్రక్కల దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతోనే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు కదా.! అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, మహాత్ములు, వాళ్ళ తపస్సుతో దేవుడిని చూసి వచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడని ఎంతో మంది గొప్ప… గొప్పవారు చెప్పారు కదా.! అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరగగా లేనిది, ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం మన పూర్వీకులనే నమ్మలేమా.!
కనుక తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకోగలను… అనే నమ్మకం నాకు ఉంది అమ్మా.!!
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత లేదు నా వయస్సు , ఏదైనా తప్పుగా మాట్లాడి వుంటే నన్ను క్షమించండి ,జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. అంటూ అతనికి నమస్కరించి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళి పోయింది🙏
ఏ మాటకామాట చెప్పుకోవాలి మనం, ఒకటి మాత్రం నిజం… ఆత్మలను, దయ్యాలు వున్నాయని నమ్మేటప్పుడు… భగవంతుడు వున్నాడు అని ఎందుకు నమ్మకూడదు?!!
