విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పేరును అష్టలక్ష్మీ దేవాలయం స్టేషన్ గా పేరు మార్చండి

మెట్రో స్టేషన్ మెట్లు సరిగ్గా అష్టలక్ష్మీ దేవాలయం ప్రధాన దారి వద్దనే ఉంటాయి. అష్టలక్ష్మీ దేవాలయం పేరు మెట్రో స్టేషన్ కు పెట్టడం కారణంగా దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులకు నేరుగా మెట్రో రైలు ఉందనే సమాచారం తెలుస్తుంది. ఈ చర్య మెట్రో కు కూడా లాభదాయకంగా ఉంటుంది. బ్రిటీషు వలస పాలకుల కృరత్వాని చిహ్నంగా ఉన్న పేరును మార్చాలని HMRL MD N.V.S. రెడ్డి గారిని VHP ప్రతినిధి బృందం కోరింది. VHP ప్రతినిధి బృందంలో జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్, రాష్ట్ర కమిటి సభ్యులు H. నాగేశ్వర్ రావు, పద్మశ్రీ , వివేకానంద్ నగర్ జిల్లా(దిల్సుఖనగర్) జిల్లా అధ్యక్షులు T. పురుషోత్తం రెడ్డి, జిల్లా కార్యదర్శి పులిమద్ది సుధాకర్ లు ఉన్నారు.