01 మార్చి 2026 దృగ్గణిత పంచాంగం & రాశిఫలాలు

🙏 01 మార్చి 2026 – దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయః – నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : త్రయోదశి రా 07.09 వరకు ఉపరి చతుర్దశి
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : పుష్యమి ఉ 08.34 వరకు ఉపరి ఆశ్లేష
యోగం : శోభన మ 02.33 వరకు ఉపరి అతిగండ
కరణం : కౌలువ ఉ 07.54 తైతుల రా 07.09 ఉపరి గరజి
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 07.00-10.00 & 11.00-12.00
మ 02.00-04.00
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ప 11.56 – 12.43
💫———————————💫
వర్జ్యం : రా 08.59 – 10.32
దుర్ముహూర్తం : సా 04.40 – 05.27
రాహు కాలం : సా 04.46 – 06.14
గుళికకాళం : మ 03.17 – 04.46
యమగండం : మ 12.20 – 01.48
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.25 – 08.47
సంగవ కాలం : 08.47 – 11.09
మధ్యాహ్న కాలం : 11.09 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.53
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
సాయంకాలం : సా 03.53 – 06.14
ప్రదోష కాలం : సా 06.14 – 08.40
రాత్రి కాలం : రా 08.40 – 11.55
నిశీధి కాలం : రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.47 – 05.36
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.25 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి
ఫోన్ : 99497 22792
01-03-2026 / ఆదివారం / రాశిఫలాలు
మేషం
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృషభం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
మిధునం
సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంభందిత వ్యవహారాలు కలసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
కర్కాటకం
బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.
సింహం
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. వస్త్ర,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు.
కన్య
నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి.
తుల
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నవి.
వృశ్చికం
ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది.
ధనస్సు
వృధా, ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి.
మకరం
వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఋణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు.ధనదాయం బాగుంటుంది.
కుంభం
సంతాన పరంగా చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది.
మీనం
అన్నిరంగాలవారికీ సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చెయ్యడం మంచిది. బంధు వర్గం నుండి శుభవార్తలు ఊరటను ఇస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి , ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
🍁 శుభం భూయాత్ 🍀
