homebanner

19 ఫిబ్రవరి 2026 గురువారం రాశి ఫలితాలు

19 ఫిబ్రవరి 2026 గురువారం రాశి ఫలితాలు

శ్రీ గురుభ్యోనమః 🙏

AVB SUBBARAO

📞 9985255805

📅 19-02-2026 గురువారం రాశి ఫలితాలు


🔴 మేషం

కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.


🟢 వృషభం

చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.


🟡 మిధునం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.


🔵 కర్కాటకం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.


🟠 సింహం

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.


⚪ కన్య

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.


⚖️ తుల

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.


🦂 వృశ్చికం

ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.


🏹 ధనస్సు

చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్యవిషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.


🐐 మకరం

చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.


🏺 కుంభం

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.


🐟 మీనం

ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ