పూజలో ఉపయోగించే విగ్రహాలు: 8 రకాల ప్రతిమల వివరాలు

🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴
ఎలాంటి విగ్రహాలు పూజలో వాడాలి?? అష్టవిధప్రతిమా భాగవతే !! శైలీ దారుమయీ లౌహీ లేప్యా లేఖ్యా చ సైకతా |
మనోమయీ మణిమయీ ప్రతిమా అష్టధా స్మృతా |
❗విగ్రహాలు లేక ప్రతిమలు ఎనిమిది రకాలుగా ఉంటాయి.
శైలీ శిలతో చేసినవి….
దారుమయీ చెక్కతో చేసినవి….
లౌహీ బంగారు వెండి రాగి లోహలతో చేసినవి….
లేప్యొ లేపనం (మట్టి, సున్నం లేదా ఇతరత్రా పదార్థాలు) తో తయారు చేసిన….
లేఖ్యా గీసినవి చిత్రపటాలు లాంటివి
సైకతా ఇసుకతో చేసినవి….
మనోమయీ మానసికంగా ధ్యానం చేసి ఊహించుకునేవి….
మణిమయీ రత్నాలు, మణులతో చేసినవి….
!! స్మృతిసంగ్రహే !! దేవతాస్స్థాపయేద్విప్రః స్థావరే ప్రాంజ్గ్ముఖాహితః | గృహాదౌ జంగమే వాపి స్థాపయేత్ప్రత్యగాననాః || స్థిరంగా ఉండే ప్రతిమలను దేవాలయాలలో ప్రతిష్ఠించే విగ్రహాలు తూర్పు వైపుకు ముఖం ఉండేలా స్థాపించాలి…..
జంగమ ప్రతిమలను చర ప్రతిష్ఠ ఇంటిలో పూజించే ప్రతిమలు లేదా చర ప్రతిమలు పడమర వైపుకు ముఖం ఉండేలా స్థాపించాలి.
భక్తులు పూజించే దిక్కులు :- దేవపూజనే దిశ నియమః తదాహ భార్గవార్చనదీపికాయాం పూర్వాశాభిముఖం దేవముత్తరాభిముఖోఽర్చయేత్ |
ఉత్తరాభిముఖం దేవం పూర్వాశాభిఖోఽర్చయేత్ |
పశ్చిమాభిముఖం దేవం పూర్వాశాభిముఖోఽర్చయేత్ |
దక్షిణాభిముఖం దేవ ముత్తరాశాముఖో యజేత్ |
ఏవం ధ్యాత్వా విధిం దేవం పుత్రపౌత్రాభివర్ధనం ||
👉 తూర్పు ముఖంగా ఉన్న దేవతను పూజించేటప్పుడు, భక్తుడు ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చోవాలి….
👉 పడమర ముఖంగా ఉన్న దేవతను పూజించేటప్పుడు, భక్తుడు తూర్పు వైపు ముఖం చేసి కూర్చోవాలి…..
👉 దక్షిణ ముఖంగా ఉన్న దేవతను ఉత్తరం ముఖంగా కూర్చొని పూజించాలి…..
👉 ఉత్తరం ముఖంగా ఉన్న దేవతను పూజించేటప్పుడు, భక్తుడు తూర్పు వైపు ముఖం చేసి కూర్చోవాలి…..
👉 [ ఇక్కడ భక్తులు ఎల్లప్పుడూ తూర్పు లేక ఉత్తరం ముఖంగా మాత్రమే పూజించాలి అని అర్థం…..]
స్మృతిముక్తావల్యాం పాద రక్షా నిషేధ:
అగ్న్యాగారే గవాం గోష్ఠే బ్రాహ్మణానాం చ సన్నిధౌ |
భోజనే దేవపూజాయాం పాదుకే పరివర్జయేత్ ||
అగ్న్యాగారే అగ్ని ఉన్న చోట లేదా హోమాలు చేసే ప్రదేశంలో.
గవాం గోష్ఠే గోవుల సమూహం ఉన్న ప్రదేశంలో….
బ్రాహ్మణానాం చ సన్నిధౌ బ్రాహ్మణ గురువుల సమీపంలో
భోజనే భోజనం చేసేటప్పుడు….
దేవపూజాయాం దేవతలను పూజించేటప్పుడు….
పాద రక్షలు ధరించరాదు…..
🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴
