శివరాత్రి వ్రత నియమాలు 2026 | ఉపవాసం, జాగరణ, చతుర్యామ పూజ పూర్తి వివరాలు

శివరాత్రి వ్రత నియమాలు క్లుప్తంగా తెలుసుకుందాం
-వ్రతం ఆచరించేవారికి ఫలం-
శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనమ్ | నైతస్మాదధికం కించిత్ ముక్తిముక్తి ప్రదాయకమ్ ||" శివరాత్రి వ్రతం అన్ని పాపాలను నశింపజేస్తుంది…. ఐహిక భోగాలను [ ఈ లోకంలో సుఖం ] ఆముష్మిక సుఖం [మోక్షాన్ని] ప్రసాదించడంలో దీనికంటే మించినది మరొకటి లేదు…
శివరాత్రి అనుమతి అనుగ్రహం కోసం ప్రాతః కాల శివప్రార్ధన శివరాత్రివ్రతం హ్యేతత్ కరిష్యేऽహం మహాఫలమ్|
నిర్విఘ్నమస్తు మే చాత్ర త్వత్ప్రసాదాజ్జగత్పతే||”
“ఓ జగత్పతీ! నేను మహా ఫలప్రదమైన ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తున్నాను…నీ అనుగ్రహంతో ఇది ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలి….”
👉 నిత్య కృత్యాలు ముగించి శివపూజా విధి ఆచరించాలి
!!***//***!! 👉 పూజ ఎలా చేయాలి “స్నాపయేత్పంచగవ్యైశ్చ పంచామృతమయైస్తథా |
శుద్ధోదకేన చ తతః శివలింగం ముదాన్వితః ||”
🌻పరమశివుడిని పంచగవ్యాలతో🌻 [ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం ]
✓ పంచామృతాలతో మరియు శుద్ధ జలంతో భక్తిశ్రద్ధలతో అభిషేకించాలి….
“అక్షతైశ్చ సుగంధైశ్చ పుష్పైర్బిల్వైస్తథైవ చ|
ధూపైశ్చ వివిధైర్దీపైర్నైవేద్యైశ్చ పృథగ్విధైః||”
✓ అక్షతలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించి, వివిధ రకాల ధూపాలు, దీపాలు మరియు నైవేద్యాలను సమర్పించాలి….
!!***//***!! [ ఉపవాసంతో పూజను ఆచరించాలి ] న స్నానైర్న చ వస్త్రైశ్చ న ధూపైర్న చ మోదకైః|
తుష్యామి న తథా పుష్పైర్యథా తత్రోపవాసతః||”
✓ “అభిషేక స్నానాల వల్ల కానీ,వస్త్రాల వల్ల కానీ,ధూప దీప నైవేద్యాల వల్ల కానీ నేను అంతగా సంతోషించను…శివరాత్రి నాడు భక్తితో చేసే ‘ఉపవాసం’ వల్ల కలిగే సంతోషం నాకు మరి దేనివల్లా కలగదు” అని శివుడు స్వయంగా తెలిపారు….
!!***//***!! ఉపవాసానికి ప్రత్యామ్నాయాలు వ్యాధితైశ్చైవ బాలైశ్చ వృద్ధైశ్చైవ తథైవ చ |
ఫలమూలాశనైః కార్యమశక్తైర్వ్రతముత్తమమ్ ||”
✓ వ్యాధిగ్రస్తులు[రోగులు] చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శారీరకంగా ఉపవాసం ఉండలేని వారు [అశక్తులు]పండ్లు, కందమూలాలు లేదా పాలు స్వీకరిస్తూ ఈ ఉత్తమమైన వ్రతాన్ని ఆచరించవచ్చు….
“నక్తం హవిష్యాన్నమౌదనం వా ఫలం తిలాః క్షీరమథాంబు చైవ|
పంచ ప్రశస్తాని హవీంషి యాని వ్రతేషు సర్వేషు ఫలప్రదాని||”
✓ ఏ వ్రతంలోనైనా సరే, పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఈ ఐదు వస్తువులను స్వీకరించవచ్చు పండ్లు, పాలు, నీరు, నువ్వులు, హవిష్యాన్నం, [ఉల్లి వెల్లుల్లి ఇత్యాదులు లేని సాత్విక ఆహారము]
వీటిని స్వీకరించడం వల్ల వ్రత భంగం కలగదు, పైగా ఫలం కూడా దక్కుతుంది….
🌻🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🌻
విశేషమైన పూజలు ఏ విధంగా చేయాలి శక్తి ఉన్నవారు 4 మార్లు పూజ చేయవచ్చు
👉 చతుర్యామ పూజా ఫలితం
👉 రాత్రిని నాలుగు భాగాలుగా చేసి పూజించడం వల్ల కలిగే ఫలితం:
ఏవం యః కురుతే భక్త్యా చతుర్యామమపి వ్రతమ్|
ముక్తిం ప్రాప్నోతి స త్యక్త్వా పునరావృత్తిదుఃఖదమ్||
👉 మహాశివరాత్రి ప్రదోషం సా 06. 10 నుంచి 08.39
👉 మహాశివరాత్రి మొదటి యామం సా6. 10 నుంచి 9.16
👉 మహాశివరాత్రి రెండవ యామం రా9.16 నుంచి 12.21
👉 మహాశివరాత్రి నిశీధి సమయం రా11.57 నుంచి 12.46
👉 మహాశివరాత్రి మూడవ యామం రా12.21 నుంచి 3.27
👉 మహాశివరాత్రి నాల్గవ యామం రా.తె3.27 నుంచి ఉ6.33
ఈ విధంగా ఎవరైతే భక్తితో నాలుగు జాముల పూజను [ చతుర్యామ పూజ ] నిర్వహిస్తారో, వారు సంసార బంధాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు….
!!***//***!! 👉 భక్తియే ప్రధానం 👈 “యథా శక్తి చరేద్భక్త్యా వ్రతం మే పరమేశ్వర |
తుష్యామి న తథా పుష్పైర్యథా భక్త్యా మదుత్తమే ||”
✓ “ఓ పరమేశ్వరా! నా శక్తి కొద్దీ [యథాశక్తి]భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తాను బాహ్యమైన పుష్ప ఉపచారాల కంటే, మనసులోని భక్తితో నేను త్వరగా మీకు సంతుష్టుడనవుతాను….”
!!***//***!! 👉 జాగరణ 👈 రాత్రౌ జాగరణం కుర్యాత్పురాణశ్రవణాదిభిః |
నృత్యైర్గీతైశ్చ వాద్యైశ్చ శివతుష్టిక రైర్మునే||”
✓ రాత్రి సమయంలో పురాణ శ్రవణం [శివపురాణం వంటివి] భజనలు,కీర్తనలు మరియు శివునికి ప్రీతికరమైన నృత్య వాద్య విశేషాలతో జాగరణ చేయాలి….
గీత వాద్యైశ్చ నృత్యైశ్చ పురాణ పఠనైస్తథా| నీత్యా జాగరణం కుర్యాత్ శివ ప్రీతికరమ్ మునే||" ✓ భజనలు,శివకథలు వినడం [పురాణ పఠనం]మరియు శివ నామ జపం చేస్తూ సమయాన్ని గడపాలి…. అనవసరమైన మాటలు [లోకాభిరామాయణం] మాట్లాడకూడదు…
👉 జాగరణ విశేషములు 👈 “యః పునః శివలింగస్య సన్నిధౌ జాగరమ్ చరేత్|
తస్య పుణ్యఫలం వక్తుం న శక్యమ్ వర్షకోటిభిః||”
ఎవరైతే శివలింగం సాన్నిధ్యంలో[ఆలయంలో] రాత్రంతా జాగరణ చేస్తారో, వారి పుణ్యఫలాన్ని వర్ణించడం కోటి సంవత్సరాలకైనా సాధ్యం కాదు....వారు చేసిన జ్ఞాతాజ్ఞాత పాపాలన్నీ భస్మమైపోతాయి.... 👉 పునర్జన్మ రాహిత్యం (మోక్షం) 👈 ” శివాలయ సమీపే తు జాగరం యః కరోతి హి |
స సర్వ పాప నిర్ముక్తో శివలోకం స గచ్ఛతి||”
✓ శివాలయానికి దగ్గరగా ఉండి జాగరణ చేసేవారు సర్వపాపాల నుండి విముక్తులై, మరణానంతరం శివలోకాన్ని చేరుకుంటారు…వారికి పునర్జన్మ ఉండదు…
పుణ్యక్షేత్రం లో ఉండే వారికి మోక్షం నిశ్చయం 🌻🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌹🌿🌴🥀🍀🌻
శివ పూజ ఇంట్లో చేసినా వారు కూడా శివాలయ దర్శనం చేయాలని అంటారు ఎందుకు??? 👉 శివాలయ దర్శన విశేషం 👈 “శివాలయసమీపస్థః శివరాత్రిం కరోతి యః|
స సర్వపాపనిర్ముక్తో గచ్ఛేచ్ఛివపురం ప్రతి||”
✓ ఎవరైతే శివరాత్రి పర్వదినాన శివాలయ సమీపంలో ఉండి వ్రతాన్ని ఆచరిస్తారో లేదా ఆలయాన్ని దర్శిస్తారో,వారు సర్వ పాపాల నుండి విముక్తులై శివలోకాన్ని పొందుతారు…..
👉 శివలింగ దర్శన ప్రభావం 👈 “దర్శనాన్ముక్తిదం లోకే శివలింగం విశేషతః |
మహాశివరాత్రౌ తద్దర్శనం కోటిజన్మాఘనాశనమ్ ||”
✓ “లోకంలో శివలింగ దర్శనం ముక్తిదాయకం….అందునా మహాశివరాత్రి రోజున ఆలయంలో శివలింగాన్ని దర్శించడం వల్ల కోటి జన్మల పాపాలు నశిస్తాయి….
ఆలయ నియమాలు అతిక్రమించి ప్రవర్తించ రాదు *********** 👉 వ్రత సమాప్తి 👈 “సంసారక్లేశదగ్ధస్య వ్రతేనానేన శంకర |
ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ ||”
✓ “ఓ శంకరా! సంసారంలోని కష్టాలతో సతమతమవుతున్న నాపై కరుణ చూపి,ఈ వ్రతం వల్ల ప్రసన్నుడవై నాకు జ్ఞాన దృష్టిని ప్రసాదించు….🧘♂️🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏
