homebanner

రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా?

రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా?

రాత్రి పడుకునే ముందు ఈ 5 పేర్లు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? లేదా పీడకలలు భయపెడుతున్నాయా? అయితే మన పురాణాలు చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే… ఎంతటి ఒత్తిడి అయినా మాయమై, వెంటనే గాఢ నిద్ర పడుతుంది!

👉 ఆ శ్లోకం ఇదే:

“అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహాబలమ్ |
కపిలో మునిరాస్తీకః పంచైతే సుఖశాయినః ||”

ఈ ఐదుగురి పేర్లే ఎందుకు తలచుకోవాలి? (సింపుల్ లాజిక్):

అగస్త్యుడు: ఈయనను తలచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలికపడుతుంది.నిద్ర పట్టకపోవడానికి ఒక కారణం అన్నం అరగక పోవడం, అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధులు తొలగిస్తుంది, వారు వాతాపి లాంటి రాక్షసున్నే అరిగించుకున్నారు.

మాధవుడు (విష్ణువు): పాలకడలిలో ప్రశాంతంగా యోగనిద్రలో ఉండే విష్ణువును తలచుకుంటే, మన మనస్సులోని అలజడులు ఆగిపోయి ప్రశాంతత వస్తుంది.

ముచుకుందుడు: ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని వరం అడిగి మరీ నిద్రపోయిన రాజు ఇతను. ఇతన్ని తలచుకుంటే నిద్ర మధ్యలో అస్సలు మెలకువ రాదు.

కపిల మహాముని: ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన ధ్యాన నిద్ర. ఈ పేరుతో మనకు కూడా అలాంటి సుఖ నిద్ర పడుతుంది.

ఆస్తీకుడు: ఈ మునిని తలచుకుంటే పాములు, విష పురుగుల భయం ఉండదు. మనకు ఒక భద్రతా భావం కలుగుతుంది.భయం నిద్ర పట్టక పోవడానికి ప్రధాన కారణం, అది వీరి స్మరణ తో పోతుంది.

కాబట్టి భయాన్ని పోగొట్టి, ఆరోగ్యాన్ని, రక్షణను మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ ఐదుగురిని తలుచుకోగానే, మన బ్రెయిన్ ఆటోమెటిక్‌గా “సేఫ్” మోడ్‌లోకి వెళ్లిపోయి, హాయిగా నిద్రపోవడానికి సిగ్నల్ ఇస్తుంది!

🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ