జీవనశైలి

ఏ ఏ తిథిలో ఏం తినకూడదు?

blank

పాడ్యమినాడు గుమ్మడికాయనూ, విదియనాడు వాకుడు కాయనూ, తదియనాడు పొట్లకాయనూ, చవితినాడు ముల్లంగినీ, పంచమినాడు మారేడునూ, షష్ఠినాడు వేమునూ, సప్తమినాడు ఉప్పునూ, అష్టమినాడు కొబ్బరి కాయనీ, నవమినాడు సొర కాయనూ, దశమినాడు తీగబచ్చలినీ, ద్వాదశినాడు మాంసమునూ, త్రమోదశినాడు ములక్కాయనూ …… చతుర్దశినాడు మినుమూ తినరాదని శాస్త్రం చెబుతోంది .

తిథిని అనుసరించి ఆహార విహారాదులు

  • పాడ్యమి నాడు కూష్మాండము ( గుమ్మడి, బూడిద గుమ్మడి ) తినరాదు. ఎందుకంటే ఇది నష్టాన్ని కలిగిస్తుంది.
  • విదియనాడు వంకాయ తినడం విషం.
  • తదియనాడు అడవి దొండకాయ తినడం వలన శత్రువులు పెరుగుతారు .
  • చవితినాడు ముల్లంగి తింటే ధన నష్టం కలుగుతుంది .
  • పంచమినాడు మారేడును ( బిల్వ ) తింటే అపనింద కలుగుతుంది.
  • షష్టినాడు వేప ఆకు, వేప పండ్లు, వేప పుల్ల నోటిలో వేసుకోవడం వలన నీచ జన్మ కలుగుతుంది.
  • సప్తమినాడు తాటి పండ్లను తింటే వ్యాధి ఎక్కువవుతుంది. అంతేగాక శరీరం నాశనం అవుతుంది.
  • అష్టమి నాడు కొబ్బరి తిన్నవారి బుద్ధి నశిస్తుంది.
  • నవమినాడు సొరకాయ ( ఆనపకాయ ) తినడాన్ని గోమాంస భక్షణవలె త్యజించాలి.
  • ఏకాదశినాడు చిక్కుడు కాయ, ద్వాదశినాడు బచ్చలి, త్రయోదశి నాడు వంకాయ తిన్నచో పుత్రుని నాశనము జరుగుతుంది.
  • అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి తిథులు, ఆదివారము, శ్రాద్ధ దినములలో, వ్రతమాచరించే రోజులలో స్త్రీతో సహవాసము, నువ్వులను తినడం మరియు శరీరానికి నూనెను పట్టించడం నిషిద్ధము.

    ( బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మఖండం : 27.37-38 )
  • ఆదివారం నాడు అలచంద పప్పు, అల్లం, వేరుశనగ, ఎరుపు రంగులో ఉండే ఆకుకూరలు తినకూడదు.
    ( బ్రహ్మవైవర్త పురాణం , శ్రీకృష్ణ ఖండము : 75-90 )
  • సూర్యాస్తమయం తర్వాత నువ్వులు వాడబడిన ఏ ఆహార పదార్థాన్ని కూడా తినరాదు.
    ( మనుస్మృతి : 4.75 )
  • లక్ష్మీప్రాప్తి కోరిక ఉన్నవారు రాత్రికి పెరుగు మరియు పేలపిండి తినకూడదు. ఇది నరకాన్ని కలిగిస్తుంది ( ప్రాప్తింపజేస్తుంది ) .
    ( మహాభారతం, అనుశాసన పర్వం : 104.93 )
  • పాలతో పాటు ఉప్పు , పెరుగు , వెల్లుల్లి , ముల్లంగి , బెల్లం , నువ్వులు , నిమ్మకాయ , అరటి , బొప్పాయి మొదలైన అన్ని రకాల పండ్లు , తులసి , అల్లం ఎన్నడూ సేవించరాదు. ఇవి విరుద్ధ ఆహారానికి సంబంధించినవి .
  • పాలు త్రాగడానికి 2 గంటల ముందు గానీ లేదా 2 గంటల తరువాత గానీ భోజనం చెయ్యాలి. జ్వరం వచ్చినప్పుడు పాలు త్రాగడం అనేది పాము విషంతో సమానం .
  • ముక్కలుగా కోసి చాలాసేపు ఉంచబడిన పండ్లు , పచ్చివి ( మామిడి , జామ , బొప్పాయి మొదలైనవి ) తినకూడదు. పండ్లు భోజనానికంటే ముందే తినండి. రాత్రికి పండ్లు తినకూడదు.
  • ఒకసారి వండినటువంటి ఆహారాన్ని మరలా వేడిచేసి తినడం వలన శరీరంలో గడ్డలు తయారవుతాయి. ఈ గడ్డలు ట్యూమర్ వ్యాధికి దారితీయవచ్చు.
  • తినకూడని పదార్థాలను తినడం ( అభక్ష్య – భక్షణము ) వలన కలిగే పాపం నశించడానికి ఐదురోజుల పాటు గోమూత్రం, గోమయం ( ఆవుపేడ ), పాలు , పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకొనవలెను .
    ( వసిష్ఠ స్మృతి : 370 )
blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక