జీవనశైలి

నైతికత

blank

మన జీవితంలో మనం వయసు పరంగా ఎదుగుతున్నప్పుడు మనకు ఇది మంచి పనో ఇది చెడ్డ పనో అనుకోకుండానే, ఏమాత్రం ఆలోచించకుండానే చాలావరకు తెలిసిపోతుంది. అయితే కొన్నివిషయాల్లో మాత్రం మెదడు, మనస్సు పెట్టి కాస్త ఆలోచించవలసి వస్తుంది.

సాధారణంగా, మనిషి తనకంటే తెలివైనవారిని, గొప్పవారిని, పెద్దవాళ్లని చూసి భయపడతాడు. ప్రతి మనిషి భయపడేది సమాజానికి, పోలీసులకు, కోర్టులకు, కేసులకు. అందుకే తప్పని తెలిసినా, అబద్ధాలు ఆడడానికి సిద్ధపడి, ఆ టైమ్‌లో రాబోయే ఆపదనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీని వలన అప్పటికప్పుడు సమస్యల నుండి బయటపడినా, జీవితంలో ముందుగా అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆ మనిషి జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇప్పుడు చాలామంది యువతులు యువకులతో, యువకులు యువతులతో స్నేహానికి ఉర్రూతలూగుతున్నారు. ప్రకృతి సహజంగా చెప్పాలంటే, ఇద్దరు యువతులు లేదా ఇద్దరు యువకుల మధ్య స్నేహం కంటే, యువతీ-యువకుల మధ్య స్నేహం మనస్సుకి సంతోషాన్ని ఇస్తుంది. అయితే హద్దులు మీరనంతవరకు ఇది తప్పు కాదు. కానీ ఈ తరహా స్నేహాలలో మనస్సుని అదుపులో ఉంచుకోవడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత అవసరం.

హిందూ సంప్రదాయ ప్రకారం వివాహం తరువాత, ఆలుమగల తొలికలయికను ఒక పవిత్రమైన భాగంగా భావిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో, చాలా మంది ఈ ఆనందాన్ని ముందే తెలుసుకోవాలనే అత్యుత్సాహంతో వివాహానికి ముందే లైంగిక చర్యలు ప్రయత్నిస్తున్నారు. ఇది హిందూ మతం ఇచ్చిన విలువలకు విరుద్ధం. వివాహానంతర కలయిక ద్వారా అభిమానం, ధర్మం, ప్రేమ అభివృద్ధి చెందుతాయి. ఇది శారీరకమైతే కాదు — మనసావాచా ఒక్కటవుతున్న ఆధ్యాత్మిక అనుభూతి.

వివాహానికి ముందే లైంగిక అనుభవం పొందినవారు, ఆ తొందరపాటు వల్ల జీవితంలో పశ్చాత్తాప పడే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ చర్యలకు ఎటువంటి చట్టబద్ధతా, రక్షణా ఉండదు.

ఈ మధ్య నేను చదివిన ఒక అంశం — “18 ఏళ్ళు దాటిన అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డాక సెక్స్ చేసుకోవచ్చా?” అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకురావాలని ఉందట. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసుకోవాలి. న్యాయంగా వివాహ వయస్సు 21 ఏళ్లు అయితే, అంతకు ముందే లైంగిక చర్యలకు అనుమతిస్తే, ఆ తరువాత వివాహానికి ఏమాత్రం విలువ ఉంటుంది?

ఇలాగే లంచం తీసుకోవడం, దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు — ఇవన్నీ తప్పని తెలిసినా జరుగుతూనే ఉన్నాయి. పట్టుబడితే ఉద్యోగాలు పోతాయి, జైలుపాలవుతారు. మరి తెలిసి చేస్తే వారిని ఏమనాలి?

ఇవి జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుండే పిల్లలను మంచి మార్గంలో పెంచాలి. ప్రతి పనిలో మంచి, చెడు ఏమిటో వారికీ వివరంగా తెలియజేయాలి. భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండాలి. మొబైల్ వాడకాన్ని తగ్గించి, పుస్తకాలు చదివే అలవాటు పెట్టాలి. జీవితం విలువ, టైం విలువ గురించి పిల్లలకి చెప్తూ, నడుచు చూపించాలి.

ఇలా చేసినప్పుడు పిల్లల్లో నైతిక విలువలు పెరిగి, సన్మార్గంలో పయనించి, వారి జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు.

– బి. మల్లికార్జున దీక్షిత్
ఫామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
సెల్: 91333 20425

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక