ఆధ్యాత్మికత

నేటి మాట

blank

శివుడు మన ఇంటికి వస్తాడా??? అంటే ‘అవును, వస్తాడు’ అనే చెప్పాలి☘️

ఇలాచేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు, ఇలా జీవిస్తేనే, శివుడు మన ఇంటికి వస్తాడు. సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే, “వృషభవాహనుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే, అమ్మ పార్వతిని వెంట తీసుకొని “జగత్పితయై” శివుఁడు మన ఇంటికి వస్తాడు.

గురువులను గౌరవిస్తూ మసలుకుంటే, బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన “శ్రీ దక్షిణామూర్తిగా” శివుఁడు మన ఇంటికి వస్తాడు.

విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే, శివుడు “అర్ధనారీశ్వరుడై” మన ఇంటికి వస్తాడు.

మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే, “నాగాభరణభూషితుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే, జగజ్జననిని వెంటపెట్టుకొని “గౌరీశంకరుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే “శ్రీ అన్నపూర్ణాసమేతుడై”శివుడు మన ఇంటికి వస్తాడు.

దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే “గంగాధరుడై” శివుఁడు మన ఇంటికి వస్తాడు.

బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే “శ్రీమీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై” శివుఁడు మన ఇంటికి వస్తాడు.

ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే “శ్రీకామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే “శ్రీవిశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

అసూయా ద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని “భోళాశంకరుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే “కైలాస వాసుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే “కాలభారవుడై” శివుడు మన ఇంటికి వస్తాడు.

ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు “రుద్రుడై” శివుడు తనలో కలుపుకుంటాడు.

అనంతాన్ని ఆవరించిన శివుడు అందరి మొరను వినగలడు.

శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం.

సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు.

శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు.

తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని(నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం.

ఇలాచేస్తే శివుడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుడు మన ఇంటికి వస్తాడు. ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు.

అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి.

🌸శుభమస్తు🌸

🍃సమస్త లోకాః సుఖినోభవంతు🍃

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected