ఆధ్యాత్మికత

లలితా సహస్రనామ పారాయణకు షోడశాక్షరి అవసరమా?

లలితా సహస్రనామ పారాయణకు షోడశాక్షరి అవసరమా?

🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🌻

👉 జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సమాధానాలు:

ప్ర: నేను లలితా సహస్రనామ పారాయణ చేస్తాను. ఈ మధ్య ఒక పుస్తకంలో లలితా సహస్రనామ పారాయణకు ముందు వేయిసార్లు షోడశాక్షరీ మంత్రజపం చేయాలన్నారు. ఆ మంత్రజపం ఏమిటి?

జ: శ్రీవిద్యకు సంబంధించిన మంత్రం షోడశాక్షరి. లలితాసహస్రనామస్తోత్రం శ్రీవిద్యలోనిదే. అందుకే షోడశాక్షరిని జపించాలి. లలితా సహస్రనామాలను పఠించాలి అని శ్రీవిద్యోపాసకుల నియమం. అలాగే బాలా, పంచదశీ – వంటి శ్రీవిద్యామంత్రాలను జపించి, సహస్రనామాలకు పారాయణ చేస్తుంటారు కొందరు. కానీ సరియైన పద్ధతిలో సరియైన గురువుద్వారా సంప్రదాయ సిద్ధంగా ఆ మంత్రాలను గ్రహించాలి. అయితే ఆ మంత్రాలను జపించాకనే లలితా నామాలను పఠించాలి అనుకోనక్కరలేదు. ఉపదేశం ఉన్నవారు కొంతసంఖ్యలో జపించి పఠించవచ్చు. ఉపదేశం లేనివారు “శ్రీమాత్రే నమః” అనే మంత్రాన్ని కుదిరినంత జపించి పారాయణ చేయవచ్చు. ఈ విషయానికి ప్రమాణంగా లలితాసహస్ర పీఠికలోనే- ‘శ్రీవిద్యాం వేత్తివా నవా’ శ్రీవిద్య తెలిసినా, లేకున్నా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చని అమ్మవారి వాక్యం ఉన్నది.

అందుకే షోడశాక్షరిని జపిస్తేగానీ లలితా సహస్రం చదవరాదని అనుకోవద్దు. షోడశాక్షరి మంత్రం కోసం వెదుకులాడవద్దు.

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected