వైకుంఠ చతుర్దశీ

పాషాణ చతుర్దశి కార్తీక శుద్ధ చతుర్దశిని “వైకుంఠ చతుర్దశి” గా లేక “పాషాణ చతుర్దశి” గా పిలుస్తుంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.
మరి ఈనాడు వాటికున్న ప్రాముఖ్యత ఏమిటో? తెలుసుకుందాం.
వైకుంఠ చతుర్దశి: మహా పవిత్రత
ఒకానొకప్పుడు దేవర్షి శ్రీనారదులవారు శ్రీమన్నారాయణమూర్తిని ఇలా ప్రశ్నించారట!
స్వామి సాధారణ ప్రజలైన నీ భక్తులకు నీ నిత్యనివాసమైన వైకుంఠం ఎలా లభిస్తుందని? అడుగగా.
శ్రీమహావిష్ణువు నారద నన్ను వైకుంఠ (కార్తీక) చతుర్దశి రోజున నన్ను వైకుంఠ నారాయుణునిగా అర్చించే ఆస్తికునకు నా అనుగ్రహం లభించి తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటాడని సమాధానమిచ్చి, జయ, విజయ లకు వైకుంఠ చతుర్దశి రోజున స్వర్గ ద్వారాలు తెరవమని ఆజ్ఞాపించారు.
కనుక శ్రీహరిని ఈ రోజు పూజించేవారు తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటారని సాక్షాత్తు స్వామివారే అభయమిచ్చారు. కనుకనే ఈ కార్తీక శుద్ధ చతుర్దశికి వైకుంఠ చతుర్దశి అని ప్రసిద్ధి కెక్కింది.
అంతే కాకుండా ఈ కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశి అని పేరు రావటానికి మరొక్క ఐతిహ్యం కలదు
మహావిష్ణువు పరమశివున్ని కాశీ వెళ్ళి పూజించడం చేత ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పేర్కొనబడి వైకుంఠ చతుర్దశి ఖ్యాతిని గడించింది.
దీని ద్వారా హరి హరులకు ఎంతమాత్రము భేదం లేదని చాలా స్పష్టంగా తెలుస్తున్నది.
కార్తీక మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే
ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్ది మందికే తెలుస్తుంది. అందరికీ కార్తీక శుభ దినాలను ఎలా ఏమేమి నిర్వహించుకోవాలి? ఏం చేయాలి? దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో అనే విషయం పై మన సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఏమి చెప్పబడినదో ఇకనుంచైనా తెలుసుకుని యథాశక్తిగానైనా ఆచరించి తరించడానికి ప్రయత్నిద్దాం. భగవదనుగ్రహానికి పాత్రులమవుదాం.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
శుభమస్తు 🙏
శ్రీ సద్గురు పీఠం లోకా సమస్త సుఖినోభవంతు 🙏
ఈ పవిత్ర తిథి మీ జీవితాన్ని దైవిక ఆశీర్వాదాలతో నింపాలని ప్రార్థిస్తున్నాము. మరిన్ని ఆధ్యాత్మిక ఆచారాలు మరియు కథల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి. హిందుటోన్ టీమ్ | www.hindutone.com
