సంప్రదాయాలు

రాఖీ పౌర్ణమి – రక్షా బంధన్ యొక్క అసలు అర్థం

రాఖీ పౌర్ణమి – రక్షా బంధన్ యొక్క అసలు అర్థం

రాఖీ పౌర్ణమి, అంటే రక్షా బంధన్ పండుగ—ఇది ఎటువంటి కులానికి, మతానికి పరిమితం కాదు.
మనుషులందరికీ రక్షణ అవసరం.
కానీ ప్రతి ఒక్కరూ తమను తాము అన్ని వేళల్లో రక్షించుకోవడం సాధ్యం కాదు.
దానికి ఇతరుల సహాయం కూడా తప్పనిసరి.

ముఖ్యంగా—

  • దొంగలనుండి,
  • దుర్మార్గులనుండి,
  • దేశద్రోహులనుండి,
  • విదేశీ దురుద్దేశ శక్తులనుండి,

మనమందరం అప్రమత్తంగా, జాగ్రత్తగా, సమైక్యంగా ఉండి ఒకరినొకరు రక్షించుకోవాలి.

ఈ భావానికి ప్రతీకమే “రక్షా బంధన్”.


రాఖీ కట్టే సందర్భంలో ప్రతిజ్ఞ

ఈరోజు మనమందరం రాఖీ కట్టేటప్పుడు ఇలా చెప్పుకోవాలి—

“నేను నీకు రక్ష! నీవు నాకు రక్ష! మనమందరం మన దేశ ప్రజలకు, మన దేశానికీ, మన భారతీయ ధర్మానికి, మన భారతీయ సంస్కృతికి రక్షణగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము.”


రాఖీ పండుగ యొక్క పూర్వ సంప్రదాయం

ఈ దేశంలో అనాదిగా రాఖీని మన పక్కన ఉన్న వారికి—
ఆడ, మగ, ప్రాంతం, భాష, కులం, మతం అనే తేడా లేకుండా కట్టడం ఆనవాయితీ.

కానీ, ఎడారి మతాల దాడులు (ప్రత్యేకంగా ముస్లింల ఆక్రమణలు) మొదలైన తరువాత, వారు స్త్రీలను—
ముఖ్యంగా బాలికలను, యువతులను ఎత్తుకుపోవడం చూసాక, ఆడపిల్లలు తమ అన్నతమ్ముళ్లకు, రక్షకులకు, “అన్నయ్యా, మా మానప్రాణాలు రక్షించు” అని రాఖీ కట్టడం మొదలైంది.


ఇప్పటి అవసరం

ఈ కాలంలో మనం రక్షా బంధన్‌ను అసలు భావంలోనే జరుపుకుందాం.
మన భారతీయుల్లో సుహృద్భావం, ఐకమత్యం పెంచుకుందాం.

నేను గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు, పేద ప్రజల చేత పలు చోట్ల రాఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
నా లక్ష్యం: కనీసం 25,000 మంది రాఖీలు కట్టుకోవడం.

మీరు కూడా కనీసం 100 మంది లేదా అంతకంటే ఎక్కువ మందితో రాఖీ కట్టించండి.
అప్పుడు వారందరితో ఇలా ప్రతిజ్ఞ చేయించండి—

“నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం మన దేశానికీ, ధర్మానికీ, సంస్కృతికీ రక్షణగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము.”


జై భారత్!

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో