సంప్రదాయాలు

పౌరోహిత్యం, ఆచారం – నేడు అవసరం, రేపటి నిలుపు

Brahmin tradition

జ్యోతిర్మయమ్

బ్రాహ్మణ బంధువులకు నమస్కారమ్ 🙏


జంగమ మహాసభలో ప్రతిజ్ఞ

ఇటీవలి కాలంలో ఒక ప్రాంతంలో జరిగిన జంగమ మహాసభలో కొందరు పెద్దలు మాట్లాడుతూ –
“వచ్చే పది సంవత్సరాలలో బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయకూడదు, దేవాలయాల్లో అర్చకత్వానికి స్థానం ఇవ్వకూడదు” అని ప్రతిజ్ఞ చేశారు.

ఈ మాటలు విని ఆలోచిస్తే – మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అన్వేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


ప్రధాన కారణాలు

ఎంత వెతికినా మూడు పెద్ద లోపాలే కనబడుతున్నాయి:

  1. అరకొర విద్యతో పౌరోహిత్యం చేయడం
  2. పౌరోహిత్యం చేస్తూనే వ్యసనాలకు బానిస కావడం
  3. జిహ్వా చాపల్యాన్ని అదుపు చేసుకోలేక బహిరంగంగా తినిపోవడం, సమాజంలో గౌరవం కోల్పోవడం

ఇవన్నీ సమాజంలో బ్రాహ్మణుల గుర్తింపు తగ్గడానికి ప్రధాన కారణాలు.


పౌరోహిత్యపు పవిత్రత కోల్పోవడం

  • పౌరోహిత్యం అంటే ప్రజలకు హితం, ధర్మం బోధించడం.
  • కానీ ఈ లక్ష్యాన్ని చాలామంది వదిలేశారు.
  • భోజనంలో నియమాలు పాటించకపోవడం, గాయత్రి మంత్రం మర్చిపోవడం, శ్రద్ధ లోపించడం… ఇవన్నీ ఆచారం నశింపజేస్తున్నాయి.

ఇతర కులాల ప్రవేశం

  • నేడు అనేక కులాల వారు పౌరోహిత్యం నేర్చుకుని చేస్తున్నారు.
  • అయ్యప్ప దీక్షలలో గురుస్వాములు వేరే కులాల వారే అవుతున్నారు.
  • వేషధారణ మార్చి “మేము బ్రాహ్మణులమే” అని చెప్పుకునే వారు మన సంఘాలలో కలిసిపోతున్నారు.

వివాహ వ్యవస్థలో పతనం

  • ఆడపిల్లలకు సమయానికి వివాహం చేయకపోవడం వల్ల కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి.
  • మగ పిల్లలు సరైన చదువులేక ఉద్యోగాలు సంపాదించలేక వివాహాలు ఆలస్యం అవుతున్నాయి.
  • ఇది మొత్తం తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నది.

కమిషన్ వ్యాపారాలు

  • పౌరోహిత్యంలో కూడా కమిషన్ వ్యవహారాలు పెరిగాయి.
  • “దక్షిణ”కు బదులుగా డబ్బు కోసం వాదించడం, బ్రోకర్లతో వ్యవహరించడం బ్రాహ్మణ గౌరవాన్ని దెబ్బతీస్తోంది.

పతనావస్థలో ఉన్న జీవనశైలి

  • కొందరు వృద్ధులు వ్యసనాలతో, గర్వంతో పౌరోహిత్యంలో దిగజారుతున్నారు.
  • కొందరు మద్యం సేవించి, మాంసాహారం తిని, మరుసటి రోజు పౌరోహిత్యం కోసం వస్తున్నారు.
  • ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా గౌరవిస్తుంది?

వంట వ్యవస్థలో లోపాలు

  • ఇతర కులాల వారిని పరిచారకులుగా, వంటవారిగా వాడుకోవడం.
  • మడిచీర కట్టడం, గోత్రాలు చెబడం నేర్పి వేరే కులాల ఆడవారిని ఆబ్దిక వంటకు పంపించడం.
  • కమిషన్ వ్యవహారాలు ఇక్కడ కూడా పెరిగాయి.

బ్రాహ్మణ సంఘాల నిర్వీర్యం

  • నెలకొకసారి ఒకరి ఇంట్లో రుద్రాభిషేకం, భోజనం చేసి మీటింగ్ – అంతే!
  • ఇది ధర్మ పరిరక్షణ కాదు.
  • ధర్మ వృక్షానికి ఆహారం ఇవ్వాలి – కేవలం పండ్లను సేకరించడం కాదు.

వేదపాఠశాలల్లో మార్పులు

  • నేడు వేదం నేర్చుకునేవారు అన్నికులాలవారు.
  • బ్రాహ్మణ పిల్లలు అలర్ట్ కాకపోతే రేపు వారికీ అసిస్టెంట్స్‌గానే ఉండాల్సి వస్తుంది.

నిజమైన మహనీయులు

  • మెదక్, నిజామాబాద్ మొదలైన ప్రాంతాల్లో ఉన్న పండితులు, కవులు, అవధానులు, శాస్త్రజ్ఞులు ఉన్నత విద్యలు, ఉద్యోగాలు సాధించినా ధర్మాన్ని వదలలేదు.
  • అలాంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.

ఆచారాల్లో నిర్లక్ష్యం

  • పిండప్రదానం, ఆబ్దిక కర్మలు, తల్లిదండ్రుల సంస్కారాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయి.
  • కొందరు పెద్దలను ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో పెట్టడం దురదృష్టకరం.

తుది హెచ్చరిక

బ్రాహ్మణుడు తన ఆచారాన్ని, క్వాలిటీని కాపాడకపోతే రాబోయే రోజుల్లో అధోగతి తప్పదు.


బ్రాహ్మణ ఆచారం గొప్పది ✨

దాన్ని నిలబెట్టుకుందాం…
బ్రాహ్మణునిగా జీవిద్దాం.

✍️ వి.వి. రమణశర్మ సిద్ధాంతి

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో