సంప్రదాయాలు

అరటి ఆకులోనే ఎందుకు భోజనం చేయాలి?

blank

ప్రకృతిలో ఎన్నో ఆకులు ఉన్నాయి. వాటన్నింటిలో కాకుండా మన వాళ్ళు కేవలం అరటి ఆకులో భోజనానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తారు

పెళ్ళికెళ్ళినా అరిటాకే. పేరంటానికి వెళ్లినా అరిటాకే.. చివరకు పల్లెల్లో చుట్టానికి కూడా అరాటాకులోనే భోజనం వడ్డిస్తారెందుకు? మామూలు ఆకులో పెడితే భోజనం తినలేరా? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.

భారతీయ వైద్యం చాలా పురాతనమైనది. అంతేకాదు ప్రకృతిలోని ఏ చెట్టు మనకు మేలు చేస్తుందో.. ఏ చెట్టు కీడు చేస్తుందో కూడా ఇట్ట చెప్పేయగల చరిత్ర ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఉంది. అందుకే భోజనానికి అరటాకు శ్రేష్టమని చెప్పారు. అది ఎలాగో చూడండి.

ఆకలి మీద శత్రువైనా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపే సాంప్రదాయం మనది. అందుకే అతను ఎటువంటి సంకోచమూ లేకుండా ఆరగించడానికి అరటాకులో వడ్డిస్తారు.

కారణం ఏంటంటే భోజనంలో విషం కలిపినా వెంటనే బయట పెట్టే గుణం అరటి ఆకుకు ఉంది. ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.

ఇది అరటాకు మీదనున్న నమ్మకానికి సంబంధించిన విషయం మాత్రమే. కానీ అరటాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేడివేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.

ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినేఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.

ఇది కేన్సరు మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్, హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. అంతేనా ఇది పర్యావరణ సమస్యను తీసుకురాదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోతాయి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సంప్రదాయాలు సంస్కృతి

హిందూ యువతపై పాశ్చాత్య ప్రభావం: సాంప్రదాయ విలువలతో ఆధునిక జీవనశైలిని సమతుల్యం చేయడం

  • November 27, 2024
నేటి పరస్పరం అనుసంధానించబడిన ప్రపంచంలో, హిందూ యువత పాశ్చాత్య ఆలోచనల వేగవంతమైన ప్రపంచీకరణ ద్వారా రూపుదిద్దుకున్న సంక్లిష్ట సాంస్కృతిక ప్రకృతి దృశ్యాన్ని అన్వేషిస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం వృద్ధి,
blank
సంప్రదాయాలు హిందూ దేవుళ్ళు

శ్రేయస్సు కోసం వ్యాపార యజమానులు శుక్రవారం నాడు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పూజ ఎలా చేయవచ్చుః

సంపద మరియు శ్రేయస్సు యొక్క స్వరూపమైన లక్ష్మీ దేవి వ్యాపార యజమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శుక్రవారం నాడు దుకాణాలలో లేదా వాణిజ్య సంస్థలలో