13-11-2025 (గురువారం) – రాశి ఫలితాలు

♈ మేషం
మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
♉ వృషభం
చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మేలు కాదు.
♊ మిధునం
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి.
♋ కర్కాటకం
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో విభేదాలు మానసిక అసాంతృప్తి కలిగిస్తాయి.
♌ సింహం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా–బయటా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
♍ కన్యా
కొన్ని పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తలనొప్పిని కలిగిస్తాయి.
♎ తులా
వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ ప్రోత్సాహకాలు లభిస్తాయి. రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.
♏ వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు సంభవిస్తాయి.
♐ ధనస్సు
సోదరులతో స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కొంత శ్రమతోనే పనులు పూర్తవుతాయి.
♑ మకరం
ఉద్యోగ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేయకపోవడం మంచిది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
♒ కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూల అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితుల సహకారం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు.
♓ మీనం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోదాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సహకారం లభిస్తుంది.
🌸 శుభం భూయాత్ 🌸
