04-09-2025 గురువారం రాశి ఫలితాలు

మేషం
- విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
- ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
- వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.
- చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
- నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు.
- అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వృషభం
- వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
- వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.
- కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి.
- సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.
- నూతన ఋణ యత్నాలు కలసిరావు.
మిధునం
- శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.
- ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.
- ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.
- వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
- వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
- దైవ చింతన పెరుగుతుంది.
- నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.
కర్కాటకం
- చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి.
- కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలరు.
- విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
- ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
- వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
- వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
సింహం
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
- కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది.
- బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి.
- వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
- క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య
- కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి.
- స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
- భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
- చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి.
- నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.
తుల
- జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.
- ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి.
- నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు.
- దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి.
- వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
వృశ్చికం
- సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.
- అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.
- వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
- బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.
- ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.
ధనస్సు
- మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు.
- ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
- చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు.
- మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు.
- వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
మకరం
- మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు.
- కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
- సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి.
- వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు.
- ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
- దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
- గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- మిత్రులకు ధన సహాయం అందిస్తారు.
- విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
- శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
- వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.
మీనం
- అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.
- విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి.
- విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.
- క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
- వృత్తి వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.
- ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.
