స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

ఆదిత్య హృదయం….!!

blank

ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.
ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడి ని చేస్తాడు.

వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండము నందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.

👉దీనిలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.

🍀 మొదటి రెండు శ్లోకాలు 🍁

👉అగస్త్యుడు, శ్రీ రాముడి వద్దకు వచ్చుట.

🍀 3 నుండి 5 శ్లోకాలు 🍁

👉 ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.

🍀 6 నుండి 15 శ్లోకాలు 🍁

👉 సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంతఃస్వరూపము ఒక్కటే అని చెప్పడం.

🍁 16 నుండి 20 శ్లోకాలు 🍀

👉 మంత్ర జపం

🍀 21 నుండి 24 శ్లోకాలు 🍁

👉 సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు

🍁 25 నుండి 30 శ్లోకాలు 🍀

👉 పారాయణ వల్ల కలిగే ఫలం.

🙏 ఆదిత్య హృదయం ప్రారంభం 🙏

🌝 ఆదిత్య హృదయస్తోత్రం 🌝

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

శ్రీమద్వాల్మీకి రామాయణం- యుద్ధ కాండములో శ్రీరామునికి అగస్త్య మహర్షిచే వుపదేశించబడిన “”ఆదిత్య హృదయస్తోత్రం””*

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ 1

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్|
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః 2

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్|
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి 3

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ 4

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్|
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ 5

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్|
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ 6

సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః|
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః|
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః 8

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః 9

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ 11

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః 12

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః 13

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః 14

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే 15

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 16

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః 18

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య- వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః 19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే|
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే 21

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః|
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ 23

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః 24

ఫలశ్రుతిః

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ 25

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ 27

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ 28

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్|
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ 30

అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః|
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి 31 ..

🌱 ఇది ఆదిత్య హృదయస్తోత్రం.సంపూర్ణం

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి