భోజనం – సదాచార నియమాలు

- భోజనానికి ముందు, తరువాత తప్పక కాళ్లు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్లను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.
- తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.
- ఆహార పదార్థాలను (కూర, పప్పు, పచ్చళ్ళు) తినే పళ్ళానికి తాకించరాదు. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
- అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు.
- భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.
- ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు.
- ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
- విరిగిన, సొట్టలు ఉన్న కంచం భోజనానికి పనికిరాదు.
- నిలబడి అన్నం తినడం దరిద్రతకు దారి తీస్తుంది.
- ఉపనయనం చేసినవారు ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకోవాలి.
- భోజన సమయంలో వంట బాగాలేదని దూషించకూడదు.
- ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోవద్దు.
- కంచం ఒడిలో పెట్టుకుని, మంచం మీద భోజనం చేయరాదు (అనారోగ్యులు మినహా).
- మాడిన అన్నాన్ని నివేదించరాదు, అతిథులకు పెట్టరాదు.
- భోజనం అయ్యాక వెంట్రుకలు కత్తిరించకూడదు.
- గురువులు, మహాత్ములు ఇంటికి వస్తే మిగిలిన భోజనం పెట్టరాదు.
- వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు.
- భోజనంలో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే విడిచిపెట్టాలి.
- భోజనం అయ్యాక విస్తరిలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
- భగవన్నామ స్మరణ చేస్తూ వంట వండడం, భోజనం చేయడం శ్రేష్ఠం.
- ఉపాసకులను, దీక్షలో ఉన్నవారిని బలవంతంగా ఎక్కువ తినమని చెప్పకూడదు.
- భోజనం చేస్తున్నప్పుడు వేదం చదువరాదు.
- గిన్నె పూర్తిగా ఊడ్చుకుని తినరాదు.
- భోజన సమయంలో నీటిపాత్రను కుడివైపు ఉంచుకోవాలి.
- స్త్రీలు బహిష్టు కాలంలో వంట, వడ్డన చేయరాదు.
- అరటిపత్రాలలో భోజనం చేసిన తర్వాత విస్తరిని మడవకూడదు.
- ఎంగిలి విస్తరాకులను తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదాతకు రాదు.
- భోజనం అయ్యాక చేతులు, కాళ్లు కడుక్కోవాలి.
- భోజనం అయ్యాక భోజన ప్రదేశాన్ని శుభ్రం చేసి మళ్ళీ వడ్డించాలి.
- స్నానం చేసి మాత్రమే వంట వండాలని నియమం.
- ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినరాదు (ద్విపాక దోషం).
- ఆడవారు గాజులు లేకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు.
