పురోహితుడు అంటే ఎవరు?

శ్లోకము:
జన్మనా జాయతే శూద్రః
సంస్కారద్విజ ఉచ్యతే
విద్యయా యాతి విప్రత్వం
త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే
పుట్టుకతో శూద్రుడు, ఉపనయన కాలంలో ద్విజుడు, విద్యాభ్యాసంతో విప్రుడు, ఈ మూడు ప్రత్యేకతలతో అతడు శ్రోత్రియుడిగా మారతాడు.
పురోహితుడు అనగా:
- ముందుగా హితము పలికెడివాడు
- ధర్మార్థ కామ్‌మోక్షములకు సోపానము
- పూజనీయుడు
- సహృదయతకు, మృదుభాషనకు, మధురానుభూతికి మారుపేరు
- నిత్య కర్మానుష్ఠానము ఒనర్చు ఒక తపస్వి
- ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు
- హైందవ సాంప్రదాయానికి రక్షణ కవచం
- సాదారణమైన పేరు వశిష్ఠుడు
- మానసిక వ్యాధిని ఛేదించె సైకాలజీ, ఒక హిప్నాటిస్ట్
- ఆత్మస్థైర్యమును, నమ్మకమును కలిగించె, బాధలను తొలగించె పిలాసపీ, ఒక మెజీషియన్
- సందేహ నివృత్తికి ఒక నిఘంటువు
- తాను ఉద్దరింపబడుచు, ఇతరులను ఉద్ధరింపజేయు జ్ఞాన దీపిక
- భగవంతునికి, భక్తునికి మద్య ఒక వారధి
- భూత భవిషత్వర్తమాన కాలముల సూచిక
- శుభాశుభ కార్యములను ఆరాధించు సమదర్శి
- నిత్య కాల గణన చేయు గణిత వేత్త
- గోసంపద, వృక్ష సంపదతో వాతావరణ కాలుష్యాన్ని నివారించు యజ్ఞమూర్తి
- పర్యావరణ పరిరక్షణలో వృక్ష ప్రతిష్టకు మొదటి ప్రతినిధి (జన్మ నక్షత్ర వృక్షాలు, యజ్ఞసమిదల వృక్షాలు, ఫలపుష్పాది వృక్షాలు, ఓషధివృక్షాలు మొదలగువాటిని ప్రతిష్టించి, పెంచి, పోషించు వాడు)
- ధర్మ శాస్త్ర ప్రియుడు
పురోహితము:
పు – పురజనులందరికి
రో – రోజురోజుకి
హి – హితముచెప్పుచు
త – తరింపజేసి
ము – ముదముగూర్చునది
పురోహితుడు అనేది కేవలం ఒక శుభకార్యాల పరిపాలకుడిగా మాత్రమే కాకుండా, సమాజం, ధర్మం, పరిసరాలను రక్షించే మరియు ఉన్నత ఆధ్యాత్మికతను ప్రవచించే వ్యక్తిగా కూడా పరిగణించబడతాడు.
