స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

వ్యాస భగవానుని జన్మదినం – గణపతి సంభాషణ ద్వారా ఒక భావోద్వేగ భక్తి గీతం”

blank

(వ్యాస పౌర్ణమి సందర్భానుభావం)


ఎల్లుండి మీ జన్మదినం వస్తుంది భగవన్…!
కాబట్టి ముందుగానే చెబుతున్నాను…

🎉 జన్మదిన శుభాకాంక్షలు వ్యాస భగవాన్! 🙏🏻

“ఎక్కడ నాయనా… జన్మదినం?”
“ఎవరికీ గుర్తుంది చెప్పు గణేశా?”

“మీరు ఈ ఆషాఢ పౌర్ణమి రోజే పుట్టారు కదా భగవాన్!”
“అవును నాయన… నీవు గుర్తు పెట్టుకున్నావు. కాని సామాన్య ప్రజలకు గుర్తుండదు.”

“మీరు ఎన్నో పురాణాలు రచించారు.
ఎన్నో యుగాల్లో జరిగిన విషయాలను మన ప్రపంచానికి తెలియజేశారు.”

“మీరు కూడా నారాయణుని అంశంగా పరిగణించబడ్డారు భగవాన్!”
“అవును గణేశా… కానీ పురాణాలు చదివినవారికే వాటి విలువ తెలుసు. చదవని వారికి నేను ఎవరో ఎలా తెలుస్తుంది చెప్పు?”

“మీరు సత్యం చెప్పారు భగవాన్…
ఈ జన్మదినాన్ని ప్రజలు మరిచిపోయారు.
వ్యాస పౌర్ణమి అనే పవిత్ర నామాన్ని మార్చి
ఇతర పేర్లతో జపిస్తున్నారు.”

“అవును నాయన…
ఆది గురువు ఎవరో కాదు — స్వయంగా మీ తండ్రిగారు.
మనకు భగవద్గీతను అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ,
ఆయనే నాకు, నీవు ఇద్దరికీ గురువు.”

“నాకు మొదటి గురువు మా తల్లి…
ఆ తర్వాత మా తండ్రి గారు.”
“అవును గణేశా… కానివ్వు!
ఈ కలియుగంలో కొంతమంది అయినా తెలుసుకుని
మీ పేరు జపిస్తారు అనుకుంటున్నాను.”

“లేదు నాయన!
చెప్పరు! ఇది కలికాలం
చదువులలో జ్ఞానం కాక, పరీక్షల కోసం పాఠాలు చదివే కాలం ఇది.”

“కానీ భగవాన్… కొందరైనా చెబుతారు,
మీరు రచించిన పురాణాలను చదివినవారు.”

“ఆ పురాణాల్లో శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు,
ఆది గురువు ఈశ్వరుడు అని నేను స్వయంగా రాశాను.”

“నీవు భారతం వ్రాయగణేశా… నీ వెనక శ్రీకృష్ణుడు ఉన్నాడు.”

“రాస్తాను భగవాన్!”

“ఎవరు గుర్తు పెట్టుకున్నా… లేకపోయినా…
నేను మాత్రం మళ్ళీ చెబుతున్నాను
జన్మదిన శుభాకాంక్షలు వ్యాస భగవాన్!
వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు!”

“చూద్దాం నాయన… ఎల్లుండి ఎవరైనా గుర్తు పెట్టుకుంటారేమో!”
“ఒకవేళ ఎవరికైనా మీరు గుర్తొస్తే గణేశా…
వారికి నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని
వారిని వరించుతాను!” 🙏🏻


శ్లోకాభివందనం:

“వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మ నిధయే, వాసిష్టాయ నమోనమః!”

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి