నిజమైన ఐశ్వర్యం – నిజమైన దరిద్రం

దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు.
ధర్మాన్ని, సంప్రదాయాన్ని వదిలి, ఉన్నదానితో తృప్తి లేకుండా ఉండడమే నిజమైన దారిద్ర్యం.
పైకి ధనం లేనట్టే కనిపించినా, ధర్మనిష్టుడై, వేదధర్మాన్ని ఆచరించి, నిత్య తృప్తుడైన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మ చేత పూజలు పొందినవాడు.
అతడు దరిద్రుడు కాదు; ఆయన పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.
❗ అన్నీ ఉన్నా ధర్మానికి దూరమై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కులదేవతను, స్వధర్మాన్ని వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రోత్సహించిన రావణుడు, రాక్షసులు, కంసుడు, కౌరవులు –
ఇవ్వాళ్ళు పైకి ఐశ్వర్యవంతులుగా కనిపించినా, అసలైన దరిద్రాన్ని అనుభవించినవారు.
❗ భగవద్ అనుగ్రహాన్ని కోరుకోవడం, ధర్మమార్గాన్ని అనుసరించడం, కులదేవతను ఆరాధించడం, స్వధర్మాన్ని పాటించడం, ఆచార–సంప్రదాయాలను కాపాడడం, గురుపాద సేవ చేయడం – ఇవే నిజమైన ఐశ్వర్యం.
ఈ వాటికి విరుద్ధమైనదే నిజమైన దారిద్ర్యం.
