దేశం మొత్తం మీద వినాయకచవితి ఖర్చు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు!

హిందూ వ్యతిరేక నాస్తిక సంఘాలు దీనిని పెద్దగా చూపించి గగ్గోలు పెడుతున్నాయి. కానీ అదే హిందూ మతం గొప్పతనం! ఇప్పటికైనా తెలిసిందా, హిందూ పండుగల అసలైన విలువ?
ఈ మా పండగ వల్ల లక్ష అరవై వేల కోట్ల రూపాయల డబ్బు అనేక వృత్తుల వారికి చేరింది.
- విగ్రహాలు తయారు చేసే కళాకారులు నుంచి వారి సహాయకులు, మట్టి ఇచ్చేవారు, రంగులు అమ్మేవారు, రంగులు వేసేవారు—అందరికీ ఉపాధి లభించింది.
- తాటాకు/వెదురు కర్రలతో పందిళ్లు వేసే కార్మికులు, షామియానా, ఫాబ్రికేషన్ పందిళ్లు వేసే వాళ్లు పనితో నిండిపోయారు.
- బ్యాండ్ మేళం, సన్నాయి, డెకరేషన్, క్లాత్ వర్క్ చేసే టైలర్లు—ఇవాళ్లందరూ బిజీ అయ్యారు.
- పూల రైతులు, కోసేవారు, అల్లేవారు, అమ్మేవారు, దండలు కట్టేవారు—వీళ్లందరికీ అధిక ధరలు వచ్చాయి.
- విగ్రహాలు తీసుకెళ్లే ట్రాలీలు, లారీలు నడిపే డ్రైవర్లు—వీళ్లకు కూడా మంచి ఆదాయం వచ్చింది.
- అన్నదానాలు, వంటమనుషులు, సహాయకులు, టెంట్ హౌస్ సామగ్రి—అందరికీ డబ్బు తిరిగింది.
- లైటింగ్, సౌండ్, డెకరేషన్ వాళ్లు—వీళ్ల సామాగ్రి మంచి ధరలకు అద్దెకు వెళ్ళింది.
- పురోహితులు, బ్రాహ్మణులు—మంచి సంభావన దక్కింది.
- కొబ్బరికాయలు, అరటిపండ్లు, పత్రి, మామిడాకులు అమ్మే రైతులు—వీళ్ల ఇండ్లకు కూడా డబ్బు చేరింది.
- హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యం, సంగీత కచేరీలు, ఊరేగింపులలో నృత్యాలు, కోలాటాలు, తోలుబొమ్మలాటలు—ప్రతీ కళాకారుడు సంతోషంగా భోజనం పెట్టుకున్నాడు.
- చివరికి రోజువారీ కూలీలు కూడా పందిర్లకు స్తంభాలు తవ్వడం, షెడ్లకు రాడ్లు ఎత్తడం, రేకులు వేసే పనులు చేసి ఆదాయం పొందారు.
వినాయక మంటపాల ద్వారా కొత్త తరానికి సనాతన సంప్రదాయం పరిచయం అవుతుంది.
ఆర్థిక మాంద్యం బారిన పడిన అనేక దేశాలు ఉన్నా, మనం ధీమాగా ఉండటానికి ఇదే కారణం. ప్రతి పండగ మన సమాజంలోని వృత్తులన్నిటికీ ఉపాధి ఇస్తుంది.
👉 కులం అంటే వృత్తి. ప్రతి కులం గొప్పదే. ఒక కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించదు.
హిందూ పండగలలో ధనం ధర్మ భద్దంగా చందాల రూపంలో సేకరించి, అందరికీ పంచబడుతుంది.
మా భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు నిలబడి ఉన్నాయి.
చివరగా ఒక మాట
వినాయకచవితి కేవలం పూజ మాత్రమే కాదు;
ఇది వృత్తిదారులకు ఉపాధి, రైతులకు ఆదాయం, కళాకారులకు గౌరవం, సమాజానికి ఐక్యత, మనందరికీ ఆనందం.
అందుకే హిందూ పండుగలలో ధనం కూడా ధర్మమే.
