పండుగలు

27/09/2025 – శనివారం- శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారం

Sri Lalita Tripurasundari Devi Alankaram

ఆశ్వయుజ శుద్ధ పంచమి

చీర రంగు: బంగారు

  • నైవేద్యం: పరమాన్నం, అల్లం గారెలు

🌺 అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు,
శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు.

  • శ్రీచక్రాధిష్టాన శక్తిగా,
  • పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా,

తనను ప్రార్థించే భక్తులకు అనుగ్రహములు ప్రసాదిస్తారు.
అమ్మవారి ఇరువైపులా శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ సరస్వతీదేవి వింజామరలతో సేవచేస్తూ ఉంటారు.
చిరునవ్వుతో వాత్సల్యమూర్తిగా శివుని వక్షస్థలంపై కూర్చొని దర్శనమిచ్చే అమ్మవారిని,
పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తులు ఆరాధిస్తారు.


📜 లలితా సప్తనామావళి

కాంచీ కామకోటి పీఠాధిపతి
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి
అత్యంత ముఖ్యమైన ఏడు నామాలను ప్రతిరోజూ జపిస్తే విశేష ఫలితములు కలుగుతాయని చెప్పారు:

  1. ఓం శ్రీ మాత్రే నమః
  2. ఓం అన్నదాయై నమః
  3. ఓం వసుదాయై నమః
  4. ఓం సచామర రమావాణీ సవ్యదక్షిణసేవితాయై నమః
  5. ఓం కటాక్షకింకరీ భూత కమలా కోటి సేవితాయై నమః
  6. ఓం శివశక్తిక్యరూపిణ్యై నమః
  7. ఓం లలితాంబికాయై నమః

🙏 లలితా స్తోత్రం (పంచరత్నం)

ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం
బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్…

(పంచ శ్లోకాలతో కూడిన ఈ లలితా పంచరత్నం ప్రతీ ఉదయం పారాయణం చేస్తే,
అమ్మవారు విద్య, ఐశ్వర్యం, శుభం, కీర్తి ప్రసాదిస్తారు.)


🌼 శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి

  • రజతాచలశృంగాగ్ర మధ్యస్థాయై నమః
  • హిమాచల మహావంశపావనాయై నమః
  • శంకారార్ధాంగ సౌందర్యశరీరాయై నమః
  • లసన్మరకత స్వచ్చవిగ్రహాయై నమః
  • మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
    (ఇలాంటివిగా మొత్తం 108 నామాలు పారాయణం చేయవచ్చు)

🌸 ఫలితము

లలితాంబికా పంచరత్నం మరియు అష్టోత్తరం భక్తిపూర్వకంగా పారాయణం చేస్తే —

  • అనారోగ్య నివారణ,
  • సంపద,
  • సౌఖ్యం,
  • భక్తి,
  • శుభసంతానం లభిస్తాయి.

🙏 ధన్యవాదములు
ముక్తినూతలపాటి శ్రీనివాసు (వాసు)

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పండుగలు

దీపాల పండుగ దీపావళి | భారతదేశంలో దీపావళి ఎలా జరుపుకుంటారు

  • September 30, 2024
దీపాల పండుగ అని కూడా పిలువబడే దీపావళిని ప్రతి అక్టోబర్ జరుపుకుంటారు. ‘దీపావళి’ అనే పదం సంస్కృత పదం ‘దీపావళి’ నుండి ఉద్భవించింది, ఇక్కడ ‘దీపా’ అంటే
blank
పండుగలు

దసరా యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్ర

  • September 30, 2024
విజయదశమిని దసరా లేదా నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం అంతటా భక్తి విశ్వాసాలు మరియు ఆనందంతో చెడుపై మంచి విజయాన్ని వర్ణిస్తూ జరుపుకుంటారు. విజయదశమి