మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు

మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లోతైన లాజిక్ ఉంది. ఎన్నో తరాలుగా వస్తున్న ఈ ఆచారాలను వారు ఊరికే చెప్పలేదు. ఇవన్నీ మన ఆరోగ్యానికి, మనస్సుకు, సామాజిక స్థిరతకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. అందుకే వాటిని సంప్రదాయం రూపంలో మన జీవనశైలిలో అమలు చేశారు.
మన సంప్రదాయాలు & వాటి వెనక ఉన్న లాజిక్
1) గాజులు ధరించడం
పూర్వకాలంలో మహిళలు ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు, తక్కువ శారీరక శ్రమ ఉండటం వల్ల హైబ్లడ్ ప్రెజర్ సమస్యలు ఉండేవి. చేతికి గాజులు ధరించడం వల్ల మణికట్టుపై ఒత్తిడి ఏర్పడి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గాజులు ఒకదానికొకటి రాపిడి చెంది శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.
2) చెవులు కుట్టించడం
చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం వెనుక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఉంది. చెవుల బయట భాగంలో ఉన్న ప్రెజర్ పాయింట్లు ఆస్తమా, మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
3) రావిచెట్టును పూజించడం
రావిచెట్టు రాత్రి పూట కూడా ఆక్సిజన్ విడుదల చేసే అరుదైన చెట్టు. అందుకే దీన్ని పవిత్రంగా భావించి పూజించే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు.
4) మెట్టెలు ధరించడం
పెళ్లైన మహిళలు కాలి రెండో వేళికి మెట్టెలు ధరించడం వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇది గర్భాశయం, గుండెకు అనుసంధానమైన నాడులకు మెరుగైన రక్త ప్రసరణ కల్పిస్తుంది.
5) గంటలు కొట్టడం
గంట ధ్వని మెదడును ఉత్తేజపరిచి ఏకాగ్రతను పెంచుతుంది. ఆ ధ్వని వాతావరణంలోని బ్యాక్టీరియాలను నాశనం చేయగలదు.
6) తలపట్టుకుని పడుకోవడం
ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రించడం మెదడు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఐరన్ ఉత్పత్తి మెదడు దిశగా పెరిగి తలనొప్పి, అల్జీమర్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
7) కుంకుమ ధరించడం
కుంకుమలోని మెర్క్యురీ మెటల్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది.
8) నమస్కారం పెట్టడం
రెండు చేతులు జోడించడం వల్ల కళ్లకు, మెదడుకు సంబంధించిన ప్రెజర్ పాయింట్లు ఉత్తేజితమవుతాయి. ఇది మననం మెరుగుపరిచి ఏకాగ్రతను పెంచుతుంది.
9) గోరింటాకు అప్లై చేయడం
గోరింటాకు ఒత్తిడిని తగ్గించి, నరాలకు ప్రశాంతత ఇస్తుంది. పెళ్లిళ్లలో దీనిని అప్లై చేయడం వెనుక సైంటిఫిక్ లాజిక్ ఉంది.
10) నేలపై కూర్చొని భోజనం చేయడం
పద్మాసనంలో కూర్చొని తినడం జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది.
11) ముందుగా స్పైసీ ఫుడ్ తినడం
జీర్ణక్రియ మెరుగుగా ఉండేందుకు ముందుగా స్పైసీ ఫుడ్ తీసుకుని, ఆ తరువాత స్వీట్స్ తినే సంప్రదాయం ఉంది.
12) రాగి నాణేలు నీటిలో వేయడం
పూర్వం రాగి నాణేలు నదులలో వేయడం వల్ల నీరు శుద్ధి అవుతుంది.
13) ఉపవాసం ఉండడం
ఉపవాసం శరీరంలో అనవసర టాక్సిన్లను తొలగించి, డయాబెటిస్, గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
14) బొట్టు పెట్టుకోవడం
నుదిటిపై ఉన్న నరాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ఏకాగ్రత మెరుగుపరిచి, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది.
15) మంగళసూత్రం ధరించడం
పగడం, ముత్యాలను మంగళసూత్రంలో పెట్టడం స్త్రీల ఆరోగ్యానికి మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
16) గ్రహణ సమయానికి ముందు ఆహారం తీసుకోవడం
గ్రహణ సమయానికి భూమి ఆకర్షణ శక్తి మార్పు చెందుతుంది. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందనే కారణంగా ముందే భోజనం చేయాలని సూచించారు.
17) నల్లరంగు దుస్తులు దూరంగా ఉంచడం
హిందూ సంప్రదాయంలో నల్లరంగు అపశకునంగా భావిస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీని పెంచుతుందనే నమ్మకంతో దూరంగా ఉంచారు.
18) ఉప్పు, మిరప, చింతపండు చేతిలో ఇచ్చుకోకూడదు
ఇవి చేతిలో ఇచ్చుకుంటే గొడవలు వస్తాయని నమ్మకం. కింద ఉంచి తీసుకోవడం ఉత్తమం.
19) కాకికి అన్నం పెట్టడం
ఇది పితృదేవతల ప్రీతికి సంకేతం. భోజనం ముందు కాకికి అన్నం పెట్టడం పుణ్యం తెస్తుందని భావిస్తారు.
20) నూతన వస్త్రాలకు పసుపు రాయడం
పసుపు క్రిమినాశిని. కొత్త బట్టలకు పసుపు రాయడం ద్వారా బాక్టీరియా వృద్ధిని నివారించవచ్చు.
ఈ సంప్రదాయాలు కేవలం నమ్మకాల కోసం మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న శాస్త్రీయమైన లాజిక్‌ను మనం అర్థం చేసుకొని పాటిస్తే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు. మన సంప్రదాయాల గొప్పతనాన్ని రానున్న తరాలకు కూడా అందించాలి.
సర్వేజనాః సుఖినోభవంతు!
