ఆరోగ్యం

ఎలాంటి భోజనాన్ని చేయాలి? ఎలాంటి భోజనం చేయరాదు? నియమాలు ఏమిటి?

blank
  • కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు.
  • పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.
  • కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు.
  • భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు.
  • చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము.
  • నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.
  • నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం.
  • గ్రహణం రోజున అనగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
  • దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.
  • తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి.
  • రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది.
  • అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి.
  • అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి. ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.
  • ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి.
  • అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి. అప్పుడే బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది.
  • భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు.
  • భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.
  • ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి.
  • విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి.
  • ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి. రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది.
  • రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.
  • తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.
  • పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది.
  • తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి.
  • ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.
  • ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి.
  • మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.
  • భోజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.
  • తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.

స్వస్తీ
సర్వేజనాసుఖినోభవంతు

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆరోగ్యం

శీతాకాలపు సెలవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉండటం ఎలా

శీతాకాలపు సెలవులు వేడుకలకు సమయం, తరచుగా కుటుంబం మరియు స్నేహితులను సందర్శించడానికి ప్రయాణం ఉంటుంది. అయితే, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలు, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు మరియు సెలవు
blank
ఆరోగ్యం

ప్రతి తల్లిదండ్రులు ఈ చలికాలంలో వారి పిల్లలకి తప్పకుండా ఇవ్వాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్ కషాయం…

  • December 15, 2024
చలికాలంలో పిల్లలు దగ్గు,జలుబు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడం కోసం ఇమ్యూనిటీ పెంచే దివ్య ఔషధం ఈ కషాయం. క‌షాయం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు