హిందూమతం

ఈరోజు (14/12/24) శనివారం పౌర్ణమి ఘడియలు రాత్రికి ఉన్న సందర్భంగా ఈ రాత్రికి వెన్నెల పారాయణం చేయండి

blank

ఈ రాత్రికి ఇలా చేయండి

కాచిన పాలల్లో ఏలకులు , పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది

👉 పౌర్ణమి చాలా చాలా విశేషం , ఇలా భక్తిశ్రద్ధలతో , పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.

మీకు ఎట్టి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది , ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.

లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది , అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు మన శరీరాన్ని శ్రీ చక్రం చుట్టి ఉంటుంది .

అంత సేపు ఒకే అసనంలో పారాయణ భక్తిగా చేస్తే ఆ శ్రీ చక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవము కలుగుతుంది , అది అనిర్వచనీయమైన అనుభూతి అనుభవిస్తుంటే అర్ధమవుతుంది , ఒక్కసారి ఊహించండి అమ్మ ప్రేమగా తన పిల్లలను ఒడిలోకి తీసుకుని లాలిస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించగలమా. శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే ఆ తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది.

ఇలా వెన్నెల పారాయణం ప్రతి పౌర్ణమి కి చేయవచ్చు

👉 ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్క సారి చదవచ్చు. ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మల సుకృతమే , అమ్మవారి అనుగ్రహం కలుగుతున్నది అనడానికి ప్రతీక.

ఏదైనా తీరని సమస్య , లేదా కోరిక ఉన్నవారు 9 సార్లు చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయి.

ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహము కోసం చేయవచ్చు , 9 సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది శక్తి కొద్దీ భక్తిగా ఒక్కసారి కూడా చేయవచ్చు.

( చంద్రోదయం తరువాత చేయవచ్చు , బయట చేయడం కుదరని వారు చంద్రుని పాలలో దర్శనం చేసుకొని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు , వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించడు అప్పుడు అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడుగా భావించి పారాయణ చేయవచ్చు )

అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని…

ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది ఆ జగన్మాత!

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
హిందూమతం

భయాన్ని అధిగమించడం: బ్లాక్ మ్యాజిక్‌లో నమ్మకం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి

ఉపోద్ఘాతం: భయం మరియు బ్లాక్ మ్యాజిక్ యొక్క ఆకర్షణను అర్థం చేసుకోవడం మనలో చాలా మంది జీవితంలో ఒక చెడ్డ సంఘటన మరొకదానిని అనుసరిస్తున్నట్లు అనిపించే సమయాలను
blank
హిందూమతం

హిందూమతం – అన్ని మతాలకు తండ్రి

హిందూమతం తరచుగా పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మతంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు, అభ్యాసాలు మరియు తత్వాలపై దాని లోతైన ప్రభావం కారణంగా చాలా