సామూహిక సంకల్పం ద్వారా ధర్మరక్షణకు మన వంతు సహకారం

గురుపూజిత మంత్రజప యజ్ఞానికి మీ పాల్గొనదలచు
మిత్రులందరికీ నమస్కారం!
జయ్ భారత్!
తమ జన్మదినాన గురువుగారు మనందరికీ ఇచ్చిన మంత్రోపదేశం మనం అందరం వినే ఉంటాం.
అది కేవలం ఉపదేశం కాదు – మనకు దారిదీపిక, ధర్మయుద్ధానికి ఆయుధం కూడా.
సనాతన ధర్మ విజయకేతనం నిరాఘాటంగా ఎగరాలంటే…
ఇది ఒక్క కొంతమంది నాయకులు, లేదా కొంతమంది సైనికులు చేసే పని కాదు.
మనందరి సామూహిక సంకల్పం అవసరం.
సామూహిక సంకల్పానికి ఉన్న శక్తి ఊహాతీతమైనది!
మన సంకల్పం – మన శక్తి
ఒక చిన్న సంకల్పం చేద్దాం:
గురువుగారిచ్చిన మంత్రాన్ని, గురువుగారిచ్చిన సంకల్పంతో,
మనమంతా కూర్చుని పూనికతో జపిద్దాం.
ఇది యుద్ధభూమిలోకి వెళ్ళడం కాదు.
కాని యోధుని మనస్సుతో, ధర్మయోధుల సంకల్పంతో మనం చేసే ప్రయత్నం ఇది.
కనీసం ఈ స్థాయిలోనైనా మనం చేయగలిగితే – అదే గొప్పకార్యం.
మంత్ర సంఖ్యా లక్ష్యం:
ఈ నెలాఖరులోపు:
- ఒక లక్ష?
- పది లక్షలు?
- ఒక కోటి?
మంత్ర జపం సంఖ్యను అందరం కలసి చేరుద్దాం!
సంఖ్యా గణన (కౌంటింగ్) అవసరం.
ప్రతి రోజూ రాత్రి 10:00 గంటల లోపున,
మీ మంత్రసంఖ్యను క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్లలో ఏదో ఒకదానికి పంపండి.
ఎస్సెమ్మెస్ చేయవలసింది:
మీ పేరు + మంత్రసంఖ్య మాత్రమే.
ఎటువంటి వివరణలు, నమస్కారాలు అవసరం లేదు.
మంత్రసంఖ్య పంపేందుకు నెంబర్లు:
- P. చంద్రశేఖర్ – 83318 14095
- శ్రీరామ్ – 99026 55221
- అప్పాజీ – 95056 90888
ఒక్క నెంబరుకే పంపండి.
మరునాడు ఉదయాన్నే, మీరు చేసిన మంత్రసంఖ్య మొత్తం వివరాన్ని అడ్మిన్లు అందిస్తారు.
సత్యం, ఆర్జవం వంటి విలువల గురించి సామవేదం వారి శిష్యులకి చెప్పాల్సిన పనిలేదు.
సంకల్ప పాఠం:
భారత దేశస్య సర్వతోముఖాభివృద్ధి పురస్సరం,
అస్య దేశస్య శత్రునివారణార్థం,
అస్య దేశస్య సర్వజనేషు సామరస్య సద్భావనా సిద్ధ్యర్థం,
హిందూధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య పరిరక్షణార్థం,
శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణాపత్య, స్కాంద షణ్మతాత్మక హైందవ ధర్మస్య అభ్యుదయార్థం,
తద్ధర్మ ప్రతికూలతా పరిహాహారార్థం,
తద్ధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం,
తద్ధర్మ వైరి క్షయార్థం చ,
మంత్రజపం కరిష్యే.
మంత్రం:
శ్రీ దుర్గాయై నమః!
సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి।
ఏవమేవ త్వయాకార్యమస్మద్వైరి వినాశనం!!
శ్రీ దుర్గాయై నమః!!
చివరిగా:
మనవంతుగా మన ధర్మాన్ని నిశ్శబ్దంగా రక్షించుకుందాం.
ఇతరులు ఎంత చేశారన్న దానికన్నా – మనమేం చేశామన్న introspection తో ఈ యజ్ఞం విజయవంతం చేయాలి.
దేశ, కాల, వయో పరిమితులేవీ లేవు.
ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.
స్వస్తి
జై భారత్
