👉 ఆచరణీయ ధర్మశాస్త్రo

ఆచరణీయ ధర్మశాస్త్రమనునది, వేదములో నుండి సులభముగ అర్ధం కావాలని పెద్దలు, ధర్మసింధు, నిర్ణయసింధు, అను పేర్లతోను ; మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు పేర్లతోను వ్రాశారు.
వాటిలో కూడ … ఋషులు చెప్పిన వాటినే వ్రాశారు. ఈ స్మృతులు, సింధువులు మొదలగునవి ధర్మనిబంధన గ్రంథములు. మానవుని ఆరోగ్యమును దృష్టిలో ఉంచుకొని ఈ శాస్త్రములు – వ్రాయబడినవి. (రోగములే పాపములు) ధర్మశాస్త్రము అంటేనే గొప్ప “ఆరోగ్యశాస్త్రము” అనాలి.
పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణబాధతే! అని చెప్పుచునే వున్నాము. మానవుడు ఆరోగ్యముగ వున్నపుడే సదాచారాలు చేయగల్గుతాడు. రోగములు రాకుండా నిరోధించునవే ఆచారములు, మంత్రతంత్రములు. వీటి ప్రభావముతో మానవుని మనస్సు శుచియై నిగ్రహమును కలిగిస్తూ వున్నది.
పూర్వము “ధర్మప్రజా సంపత్త్యర్ధం స్త్రియముద్వహేత్||” అనే భావముతో వివాహము చేసుకొనెడివారు. పిల్లలు ఆరోగ్యవంతులుగాను ధర్మాచరణులుగాను వుండేలాగున పుట్టేవారు. ధర్మము వలన దేశము సుభిక్షముగా వుండేది. ప్రకృతములో మనము ధర్మలోపము చేయుట వలన మన పిల్లలే మనకు అడ్డం తిరుగుతున్నారు. మన సాంప్రదాయమునకు విరుద్ధముగ తయారైనారు. ఈ విధముగా జరగడంలో ప్రయోగలోపమే ప్రధాన కారణము.