homebanner

చంద్రగ్రహణం 03 మార్చి 2026: పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం – సమయం, నియమాలు, రాశి ఫలితాలు & పరిహారాలు

చంద్రగ్రహణం 03 మార్చి 2026: పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం – సమయం, నియమాలు, రాశి ఫలితాలు & పరిహారాలు

చంద్రగ్రహణం

(ఈ ఏడాదిలో చివరి గ్రహణం.)

మార్చి 3వ తేదీ (03-03-2026) పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహం ఏర్పడనుంది. ఆ రోజు పౌర్ణమి మంగళవారం పూర్వ ఫాల్గుణి (పుబ్బ నక్షత్రం నందు) సింహరాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారత్‌లో సంభవిస్తన్న నేపథ్యంలో ఆ రోజు గ్రహణ నియమాలు పాటించాలి. ఆలయాల మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు ఆచరించాల్సి ఉంటుంది. భారత్‌లో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపిస్తుందని కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ గ్రహణమైనప్పటికీ.. భారత్‌లో సాయంత్రం 6:20 గంటలకు.. చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. దీంతో గ్రహణ నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది.

గ్రహణం ప్రారంభం

మార్చి 3న మధ్యాహ్నం 3:21 గంటలకు భారత్‌లోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ఈ గ్రహణం ప్రారంభమవుతుంది.

గ్రహణ మధ్య కాలం: సాయంత్రం 6:03 గంటలు.
గ్రహణ మధ్య సంపూర్ణ కాలం: సాయంత్రం 5:32 గంటలు.
గ్రహణ మోక్ష కాలం: సాయంత్రం 6:48 గంటలు.

అంటే మొత్తం గ్రహణం ఏర్పడే పూర్తి సమయం: 3:27 గంటలు


ఎవరు చూడకూడదంటే..?

సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12:00 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి. గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల.. ఈ రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశులపైనా ఈ గ్రహణ ప్రభావం చెడు ఫలితాలను చూపే అవకాశం ఉంది. మిగిలిన రాశుల మీద మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు మరుసటి రోజు గ్రహశాంతులు, జపాలు పాటిస్తే.. గ్రహణ దోషాలు తొలగుతాయి.


నియమాలు.. పరిహారాలు..

గ్రహణానికి ముందు పట్టు స్నానం (తల స్నానం), గ్రహణం తర్వాత విడుపు స్నానం చేయాలి. మరీ ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.


ఆహారం నిల్వ ఉంటే

నిల్వ ఉన్న ఆహారం ఉంటే.. ఆయా పదార్థాలపై దర్బలను ఉంచడం శ్రేయస్కరం.


పుణ్యకాలం

గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ కాలంలో చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఇదే సమయంలో చేసే జప, తపాలకూ విశేషమైన పుణ్యం లభిస్తుంది.

గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి, పుణ్యాలను కలుగజేస్తాయి.


దానాలు

చంద్ర గ్రహణ సమయంలో/ గ్రహణానంతరం, లేదా మర్నాడు వెండి సర్పం, వెండి చంద్ర బింబం 1-1/4 బియ్యం, గోదానం, వంటివి విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి.


గ్రహణం వీడిన తర్వాత

గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరుచుకోవాలి.

🙏🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ