జీవనశైలి

ప్రతి అమ్మాయిలోనే అమ్మ దాగుంది: వివాహం మరియు స్త్రీ పాత్ర

blank

ప్రతి అమ్మాయిలోనే అమ్మఅనే పదం దాగి ఉంది. ఇది కేవలం భాషా పరంగా కాకుండా, ఆమె జీవితంలోని తప్పనిసరి మార్పులను సూచిస్తుంది. వివాహం ఒక అమ్మాయిని అమ్మగా మార్చే ఒక ప్రక్రియ. చదువు, ఉద్యోగం లాగే వివాహం కూడా ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం.

వివాహం చేసుకున్న స్త్రీకి సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. తన భర్త తనను రక్షించుకుంటూ, అతని ప్రేమతో ఆమె ఒక కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ ఆమెను మాతృత్వం వైపు నడిపిస్తుంది, ఇది ప్రకృతి ధర్మాల ఒక భాగం.

భర్తను కేవలం రక్షకుడిగా కాకుండా, ఒక మంచి స్నేహితుడుగా చూడాలి. ఆయన స్త్రీని శృంగార జీవితంలో ఆమెను మాతృమూర్తిగా మార్చడానికి సహాయపడతాడు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర అవగాహన, అనురాగం ఉన్న చోటు వారిద్దరూ కలిసి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించగలరు.

అమ్మతనం అనేది ఒక మహిళకు లభించే అపురూపమైన బహుమతి. ఈ బహుమతిని వివాహం ద్వారా మాత్రమే పొందవచ్చు. పెళ్ళి అనేది కేవలం రెండు మనసుల కలయిక కాకుండా, రెండు ఆత్మల ఐక్యత కూడా. మరియు అమ్మాయి తల్లిగా మారినప్పుడు సమాజంలో ఆమెకు కొత్త గౌరవం కలుగుతుంది.

ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఒక మహిళ తన జీవితంలో చివరి వరకు తనకు తోడునీడగా ఉండగల భర్తను పొందుతుంది. అనుభవజ్ఞులైన తల్లితండ్రులు ఈ వివాహానికి ముందడుగు వేసి, మీ పిల్లల వివాహానికి తగిన సమయంలో సహాయం చేయండి.

బి మల్లికార్జున దీక్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక