ఆరోగ్యమే మహాభాగ్యం!

(బి. మల్లికార్జున దీక్షిత్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్)
మీకు తెలుసా?
మనం తరచూ డబ్బు గురించి, సమయం గురించి మాట్లాడుకుంటాం. కానీ వీటి కంటే మిన్నగా అతి విలువైనది ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత సమయం ఉన్నా ఉపయోగం ఉండదు. ఆరోగ్యం ఉన్నప్పుడు మనం నిజంగా జీవితం ఆనందంగా గడపగలుగుతాం.
మన తల్లిదండ్రులు, తాతయ్యలు, బామ్మలు వేసే పోషకాహారాన్ని తింటూ మనం ఎదిగాం. అందుకే ఈ రోజుల్లోనూ కొంత ఆరోగ్యంగా ఉన్నాం.
కానీ మన పిల్లలు, మనవళ్లు ఎలా ఎదుగుతున్నారు?
వారు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటున్నారా?
మాంసాహారం కన్నా శాఖాహారం చాలా ఆరోగ్యకరం.
శాకాహారంలోనూ చేపలు, కూరగాయలు, పప్పులు, ఆకుకూరల ద్వారా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.
ఇప్పుడు పిల్లలు పిజ్జాలు, బర్గర్లు, మైసూర్ బోండా వంటి మైదాపిండితో చేసిన ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. ఈ అలవాట్ల వలన:
- చిన్నవయసులోనే వ్యాధుల బారిన పడుతున్నారు
- ఆయుష్షు తగ్గుతుంది
- శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది
ఇలాంటివి పూర్తిగా మానితే మంచిదే.
లేకపోతే ప్రత్యేక రోజుల్లో, పండుగ సందర్భాల్లో మాత్రమే మితంగా తినాలి.
మంచి ఆరోగ్యానికి సులభమైన చిట్కాలు:
- సున్నుండలు, జంతికలు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్, నువ్వులతో చేసిన పదార్థాలు తినండి
- తాజా ఆకుకూరలు, కూరగాయలు వండుకుని తినండి
- కొబ్బరి, మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మంచివి
- మీ ఇంట్లో వాడుతున్న నూనెపై ఒకసారి ఆలోచించండి
- చక్కెర బదులుగా బెల్లం పొడిని వాడండి
ఒక్కసారి మీరు హోటల్‌కి వెళ్ళినప్పుడు మంచి ఆహారం కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. అలానే మీ ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో కాస్త ఖర్చవడం సమంజసమే.
ఆరోగ్యమే సర్వస్వం. ఆరోగ్యంగా ఉండండి, ఇతరులకు ఆరోగ్యవంతమైన జీవన శైలిని సూచించండి.
బి. మల్లికార్జున దీక్షిత్
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 సెల్: 9133320425
