జీవనశైలి

ఆధునిక జీవనశైలి: మన సంబంధాలను మెల్లగా దూరం చేస్తున్న కాలం

సమయం లేదు అంటున్న ఆధునిక మనిషి – సంబంధాల నుంచి దూరమవుతున్న జీవితం

ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణంఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది,అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం
ఇప్పుడు 2 మందికే పరిమితమైంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది,
ఇప్పుడు 2 సెకన్లలో చేరుతుంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికి
ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి,
ఇప్పుడు సెకన్లలో కనిపిస్తోంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.

ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది,
ఇప్పుడు లిఫ్ట్‌లో క్షణాల్లో పూర్తవుతోంది,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి,
ఇప్పుడు మొబైల్‌లో సెకన్లలో లావాదేవీలు చేస్తాడు,
అయినా అంటున్నాడు –
సమయం లేదు

ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి,
ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి,
అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు

బైక్ పై వెళ్తూ ఒక చేయి హ్యాండిల్‌పై, ఇంకో చేయి ఫోన్‌పై –ఆగి మాట్లాడే సమయం లేదంటూ – సమయం లేదు

కారు నడుపుతూ ఒక చేయి స్టీరింగ్‌పై, ఇంకో చేయి వాట్సాప్‌పై ఎందుకంటే అతనికి సమయం లేదు.

ట్రాఫిక్‌లో తానే కొత్త లేన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతాడు –
ఎందుకంటే అతనికి సమయం లేదు.

స్నేహితుల మధ్య, జనాల్లో ఉన్నా
వేళ్లు మాత్రం ఫోన్‌లోనే బిజీ –ఎక్కడికో చేరాల్సి ఉందట సమయం లేదు

ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు,కానీ మనుషుల మధ్య ఉంటే అసహనంగా మారతాడు –
ఎందుకంటే అతనికి సమయం లేదు.

అతనికి సమయం లేనివి

  • పుస్తకాలు చదవడానికి సమయం లేదు
  • •యెగా చేయడానికి సమయం లేదు
  • తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు
  • స్నేహితులను కలవడానికి సమయం లేదు
  • ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు
  • కుటుంబంతో ఉండడానికి సమయం లేదు
  • భోజనం చేయడానికి సమయం లేదు
  • నిద్రపోవడానికి సమయం లేదు
  • కానీ
    వీటికి మాత్రం సమయం ఉంది…
    IPL, Netflix, వాట్సప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, మరియు ఇతర సోషల్ మీడియా లోని,అర్థంలేని రీల్స్
    అనవసర రాజకీయ వాదనలకు.. సమయం పుష్కలంగా దొరుకుతుంది..

వాస్తవం
ప్రపంచం సులభమైంది,
సాంకేతికత దగ్గరైంది,
దూరాలు మాయమయ్యాయి,
సౌకర్యాలు పెరిగాయి,
అవకాశాలు విస్తరించాయి…
అయినా మనిషి కి
సమయం లేదు అని చెబుతూనే
తన నుంచి తానే దూరం అవుతున్నాడు..

చివరి సత్యం
ఒక రోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది.ఆ చివరి క్షణంలో అతనికి అర్థమవుతుంది:
సమయం ఉంది…
కానీ అప్పటికె జీవితం మొత్తం అయిపోయి చివరి క్షణాల్లో ఉంటాడు అప్పుడు ఎంత సమయం ఉన్నా వృధా..

దయచేసి బంధాలకు, బంధుత్వాలకు, స్నేహితులకు, సేవా కార్యక్రమాలకు, సమయాలు కేటాయిస్తూ ఉన్నన్ని రోజులు *పేరు ప్రఖ్యాతలు గడిస్తూ సుఖంగా సంతోషంగా ఉన్నన్ని రోజులు జీవించండి…

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక