పరీక్ష రోజు ఇలా చేయండి..

- ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవండి.
- ఒక గంట పాటు తప్పక చదవండి.
- కాలకృత్యాలు తీర్చుకోండి.
- మీకు ఉత్సాహాన్ని ఇచ్చే బట్టలు ధరించండి.
- వీలైతే వాచ్ పెట్టుకోండి.
- అల్పాహారం విషయంలో జాగ్రత్త:
- ఇడ్లీ, పొంగల్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి.
- నూనెలో వేయించిన వడలు, బోండాలు, దోశ, పూరి వంటి వాటికి దూరంగా ఉండండి.
- అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోండి:
- హాల్ టికెట్, ప్యాడ్, రెండు పెన్నులు, స్కేలు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్, మంచినీటి బాటిల్, చేతి గడ్డ, సరిపడినంత డబ్బులు.
- పరీక్షకు వెళ్లే ముందు:
- కొంతమంది పరీక్ష కేంద్రానికి వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. ఇలా చేయవద్దు.
- పరీక్షకు బయలుదేరే గంట ముందు చదవడం ఆపి ప్రశాంతంగా ఉండండి.
- పరీక్ష కేంద్రానికి గం. 8:30 నాటికి (తొలి రోజు అయితే గంట ముందే) చేరుకోండి.
- మీకు కేటాయించిన రూమ్, మీ సీటింగ్ సరిచూసుకోండి.
- పరీక్ష హాల్లోకి వెళ్లేముందు:
- కాలకృత్యాలు తీర్చుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో హాల్లోకి వెళ్లండి.
- రిలాక్స్ గా కూర్చొని రెండు, మూడుసార్లు ఊపిరి బాగా పీల్చుకుని నెమ్మదిగా వదలండి.
- ఇన్విజిలేటర్ చెప్పే సూచనలు, సలహాలు తప్పక పాటించండి.
- ప్రశ్న పత్రం అందుకున్న తర్వాత:
- ప్రశ్నలన్నీ ఒకసారి పూర్తిగా చదవండి.
- తెలియని ప్రశ్నలు ఉంటే కంగారు పడొద్దు.
- ప్రశ్న పత్రం కఠినంగా ఉంటే ఆందోళన చెందొద్దు. అందరికీ అలానే ఉంటుంది.
- సమాధానాలను రాయేటప్పుడు:
- బాగా తెలిసిన ప్రశ్నలతో మొదలు పెట్టండి.
- ప్రశ్నకు అడిగిన సమాధానాన్ని సూటిగా రాయండి – అనవసరమైన విషయాలు రాయొద్దు.
- సమయం ఉంటేనే ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం రాయండి.
- మధ్యలో జవాబు మర్చిపోతే ఖాళీ వదిలి తర్వాత తిరిగి రాయండి.
- ఏ ప్రశ్నను వదలొద్దు – ఏదో కొంతైనా రాయండి.
- పరీక్ష ముగింపునకు 10 నిమిషాల ముందు:
- జవాబులు పూర్తయ్యాక, ఒక్కసారి సమీక్షించుకోండి.
- అన్ని ప్రశ్నలకు జవాబులు రాసామా? ప్రశ్న నంబర్లు సరిగానే వేశామా? చెక్ చేసుకోండి.
- హాల్ టికెట్ నెంబర్ సరిగా వేశారా లేదో మరోసారి చూసుకోండి.
- ఇన్విజిలేటర్ మీ జవాబు పత్రం తీసుకునే వరకు పరీక్ష హాల్లోనే ఉండండి.
విజయోస్తు!
దిగ్విజయోస్తు!
