స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

ఈ ఆదివారం రోజున సూర్య అనుగ్రహం కోసం సూర్య అష్టకం పఠన చేయండి.

blank

అర్థ వివరణ కూడా ఇవ్వబడింది. తెలుసుకుని చదువుకుని మరింత మంచి ఫలితాలు పొందుదాం…!!

🌿1. ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

🌸అర్థము : ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, ఉదయభనుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం.

🌿2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

🌸అర్థము : ఏడు గుఱ్ఱములు గల రథమునందు పయనించువాడు అద్భుతంగా ప్రకాశించువాడు, కశ్యపుని కుమారుడు తెల్లని పద్మమును ధరించినవాడగు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

🌸అర్థము : ఎ ఱ్ఱని రథముపై పయనించువాడు సర్వలోకములకు ప్రభువు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

🌸అర్థము : సత్వ, స్తమో, రజో గుణములు దాల్చినవాడు మహాశూరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకుడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿5. బ్రంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |
ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

🌸అర్థము : దేదీప్యమానముగ ప్రకాశించువాడు, అంతట వ్యాపించినవాడు సర్వలోకములకు ప్రభువు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿6. బంధూకపుష్పసంకాశం – హారకుండలభూషితం |
ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

🌸అర్థము : బంధూక పుష్ప వర్ణము కలవాడు, మెడలో హారము, చెవి పోగులు ధరించినవాడు కాల చక్రమును చేత ధరించినవాడు సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿7. తం సూర్యం జగత్‌కర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|
మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

🌸అర్థము : సర్వ లోకపాలకుడైన సూర్యభగ వానుడు సర్వలోక ప్రభువు, సర్వ పాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానవి జ్ఞానమోక్షదమ్‌ |
మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

🌸అర్థము : లోక పరిపాలకుడు, జ్ఞానము, విజ్ఞానము, మోక్షము నొసగువాడు సర్వపాపములను నశింపజేయునట్టి సూర్యభగవానునకు ప్రణమిల్లుచున్నాను.

🌿9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

🌸అర్థము : ఈ సూర్యాష్టకం ప్రతీదినం పఠించిన వారికి గ్రహపీడలు నశించును. పుత్రులు లేని వారికి పుత్రులు కల్గుదురు. దరిద్రలు ధనవంతులగుదురు

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి