శ్రీ దేవీ శరన్నవరాత్రుల విజయోత్సవం

ఈరోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా పదకొండు రోజుల పాటు విజయవంతంగా పూర్తవుతున్నాయి.
ప్రతి నిత్యమూ ఈ శరన్నవరాత్రులలో, ఉదయం మరియు రాత్రి, ఆ రోజు ప్రత్యేకత, ఆ అవతార విశిష్టత, పూజా విధానము—ఇవన్నీ నా శక్తి మేరకు మీతో పంచుకున్నాను.
మీరు ఈ ప్రయత్నాన్ని ఎంతో ప్రేమతో ఆదరించారని మనఃపూర్వకంగా నమ్ముతూ, హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
🌻🙏🌹🍁
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,
సురారులమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ,
దన్నుబో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గమ్మా,
మా యమ్మా, కృపాబ్ధియిచ్చు మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలదియమ్మా!!
🍁 శ్రీ [ మహాకాళీ – మహాలక్ష్మీ – మహాసరస్వతి ] 🍀
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ధన్యవాదములు 🙏
ముక్తినూతలపాటి శ్రీనివాసు (వాసు)