తదియ నోములు, షోడశ గౌరీ, హరితాళికా వ్రతము & వినాయక చవితి పండుగల వివరణ

తదియ నోములు
తేదీ: 26 ఆగస్టు 2025, మంగళవారం
వ్రతము చేయవలసిన శుభ సమయములు
- ఉదయం 6:00 నుండి 8:30 వరకు
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:10 వరకు
👉 ఈ రెండు సమయములు శ్రేష్ఠముగా పరిగణించబడును.
షోడశ గౌరీ వ్రతము
ఈ వ్రతమును సుమంగళులు, సౌభాగ్యవంతులు చేసుకుంటారు.
దేవి గౌరీదేవిని ఆరాధించి ఆయుష్షు, ఆరోగ్యం, సుఖసంపదలు, సంతాన సౌభాగ్యము కోరుతూ ఈ వ్రతం ఆచరించబడును.
హరితాళికా వ్రతము
హరితాళికా వ్రతము స్త్రీలు ముఖ్యంగా శివపార్వతుల అనుగ్రహం కోసం ఆచరిస్తారు.
పార్వతి దేవి శివుడిని పొందుటకై ఈ వ్రతమును చేసినందువలన స్త్రీలు ఆయుష్షు కలిగిన భర్తను పొందుటకై, సకల సౌభాగ్యములను పొందుటకై ఆచరిస్తారు.
వినాయక చవితి పండుగ
తేదీ: 27 ఆగస్టు 2025, బుధవారం
వినాయక చవితి పూజలకు శుభ సమయములు
- ఉదయం 6:00 నుండి 7:30 వరకు
- ఉదయం 9:00 నుండి 11:48 వరకు
- మధ్యాహ్నం 12:50 నుండి 2:10 వరకు
👉 పై సమయములు శ్రేష్ఠములు
సాయంత్ర మండపంలో విద్య గణపతి పూజలకు శుభ సమయములు
- సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు
- సాయంత్రం 6:00 నుండి 7:00 వరకు
- సాయంత్రం 7:00 నుండి 10:00 వరకు
- రాత్రి 11:00 నుండి 12:00 వరకు
👉 ఇవన్నీ శ్రేష్ఠ సమయములు
