రేపటి నుండి (సోమవారం) ఆశ్వయుజ మాస శరన్నవరాత్రి ప్రారంభం

22-09-2025 సోమవారం నుండి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా,
అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారాలు అర్పిద్దాం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి,
విజయవాడ కనకదుర్గాదేవి, కాంచీ కామాక్షి, మధురమీనాక్షి, కాశీ విశాలాక్షి, శారదామాత,
తెలంగాణ బతుకమ్మ, గ్రామదేవత పోలేరమ్మ,
అమ్మలుగన్న అమ్మ మూలపుటమ్మ మహిషాసుర మర్దిని –
ఈ దివ్యరూపిణి తల్లిని స్మరించుకుందాం.
శ్లోకము
శ్రీవిద్యాం శరదిందుపూర్ణవదనాం హ్రీంకారబీజాక్షరీం
మాణిక్యాదిమనోజ్ఞరత్నవిభవాం చిద్రూపిణీం శారదాం
త్రైలోక్యైకవిరాజమానరుచిరా మింద్రాదిసంపూజితాం
ధ్యాయేత్పావనమాతరం భగవతీం కారుణ్యవారాంబుధిమ్
శరన్నవరాత్రి ఆరాధన
దసరా శరన్నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు.
ఈ శరన్నవరాత్రులలో భక్తులు శక్తి కొలది ఉదయం మరియు సాయంత్రం రెండు పూటలా అమ్మవారిని ఆరాధించి, దినదినం ఆయురారోగ్య, వ్యాపార, ఉద్యోగ వృద్ధితో పాటు ధన, కనక, వస్తు, వాహనాదుల ఐశ్వర్యాలను పొందాలని ప్రార్థించాలి.
భక్తులు యథాశక్తిగా గణపతి పూజతో ఆరంభించి, ఏరోజు ఏ అవతారమో ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తర శతనామాలను చదివి పూజించడం ఉత్తమం.
నవరాత్రి రోజువారీ దేవి అలంకారములు
22-09-2025 సోమవారం – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకారం
చీర రంగు: లేత గులాబీ
నైవేద్యం: బెల్లం పొంగలి
23-09-2025 మంగళవారం – ఆశ్వయుజ శుద్ధ విదియ
శ్రీ గాయత్రీ దేవి అలంకారం
చీర రంగు: నారింజ
నైవేద్యం: నిమ్మకాయ పులిహోర
24-09-2025 బుధవారం – ఆశ్వయుజ శుద్ధ తదియ
శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
చీర రంగు: గంధం
నైవేద్యం: దధ్యోజనం / కట్టె పొంగలి
25-09-2025 గురువారం – ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం
చీర రంగు: కనకాంబరం
నైవేద్యం: పాలాన్నం
26-09-2025 శుక్రవారం – ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
చీర రంగు: పింక్
నైవేద్యం: రవ్వకేసరి
27-09-2025 శనివారం – ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారం
చీర రంగు: బంగారు
నైవేద్యం: పరమాన్నం / అల్లం గారెలు
28-09-2025 ఆదివారం – ఆశ్వయుజ శుద్ధ సప్తమి
శ్రీ మహాచండీ దేవి అలంకారం
చీర రంగు: ఎరుపు
నైవేద్యం: చక్కెర పొంగలి
29-09-2025 సోమవారం – ఆశ్వయుజ శుద్ధ అష్టమి
శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
చీర రంగు: తెలుపు
నైవేద్యం: కొబ్బరి అన్నం / అటుకులు / బెల్లం
30-09-2025 మంగళవారం – ఆశ్వయుజ శుద్ధ నవమి (మహానవమి)
శ్రీ దుర్గాదేవి అలంకారం
చీర రంగు: ముదురు నీలం
నైవేద్యం: కదంబం
01-10-2025 బుధవారం – ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)
శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
చీర రంగు: మెరూన్
నైవేద్యం: పొంగలి / గారెలు / వడపప్పు / పానకం
02-10-2025 గురువారం – ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
చీర రంగు: ఆకుపచ్చ
నైవేద్యం: పులిహోర
ముగింపు
ఈ ఆశ్వయుజ నవరాత్రులలో అమ్మవారిని యథాశక్తిగా ఆరాధించినవారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
శ్రీ మాత్రే నమః – శ్రీ మహాలక్ష్మ్యై నమః – శ్రీ సరస్వత్యై నమః
వాసు ముక్తినూతలపాటి
