సంధ్యా దీపం జ్యోతి 🙏

నమోస్తుతే
🌸
శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్ నమోస్తుతే 🪔
🌸
దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః,
దీపో హారతి మే పాపం
దీప-జ్యోతిర్-నమోస్తుతే 🪔
🙏 అర్థం :
🌺 ఏ దీపజ్యోతి మనకు శుభం, కళ్యాణం,
ఆరోగ్యం, ధనసంపదలు ప్రసాదిస్తుందో,
చెడు తలపులను, శత్రువుల బుద్ధిని తొలగిస్తుందో,
ఆ దీపజ్యోతికి నేను ప్రణమిల్లుతున్నాను.
🌺 ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో,
ఏ దీపజ్యోతి జనార్ధనుడో,
ఏ దీపజ్యోతి పాపములను తొలగించి మనల్ని కాపాడుతుందో,
ఆ దీపజ్యోతికి నేను ప్రణమిల్లుతున్నాను. 🪔
✨ దీపజ్యోతి అనేది శాశ్వత శుభసంకేతం,
మన ఇంటిలో వెలిగే దీపం దైవకాంతిని ప్రసరిస్తూ,
మనసుకు శాంతి, జీవితానికి వెలుగు నింపుతుంది. ✨
