ఎందుకయా సాంబశివా 🎶

మహా కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అమర గీతం
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
ఈ అల్లరి చేతలు
ఈ బూడిద పూతలు
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 అలల తోటి గంగ పట్టి
తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు
కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 తోలు గట్టి పటకాగా
కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి
ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా
🔹 రుద్రుడవో, కారుణ్య సముద్రుడవో
హరహరహర
ఎందుకయా ఈ దాసుని
కందవయా దయామయా
ఎందుకయా సాంబశివా
ఎవరు నీకు చెప్పేరయ
సాంబశివా సాంబశివా 🚩🙏🌸🎻
✍️ కవి: దేవులపల్లి కృష్ణశాస్త్రి 🎶
